Breaking News

గొల్లపూడిలో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…

-వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం గొల్లపూడిలో వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ స్థానికులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ మాట్లాడుతూ మరణం లేని మహానేత…ఓటమి ఎరుగని మగ మహారాజు…తెలుగు ప్రజల గుండె చప్పుడు, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి…రైతు బంధువు…ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నం…మన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. రాజన్న పాలన ఒక స్వర్ణ యుగం. మహనేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 ఏళ్ల గడిచిన అ మహనీయిని జ్ణాపకాలు మన మదిలో చిరస్మరణీయమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి అని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నాయకులు డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ తో పేద విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేశారన్నారు. ఉచిత విద్యుత్ తో రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచారన్నారు. మహిళా సాధికారతకి వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకం అని అన్నారు. 6 ఏళ్ళలోనే 60 ఏళ్ళ ప్రగతిని చూపారన్నారు. రాజన్న పాలన మళ్లీ మనం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహనరెడ్డి ద్వారా తిరిగి పొందడం మన అదృష్టమని అన్నారు. పేదల గుండె చప్పుడు, సంక్షేమ సూర్యుడు, అపర భగీరథుడు మన రాజశేఖరుడన్నారు. మనసున్నవాడు పాలకుడు అయితే పాలన ఎంత ప్రజారంజకంగా ఉంటుందో చూపిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ప్రజాహృదయాల్లో జీవించే ఉన్న రాజన్న స్మృతి చిరస్మరణీయం అని అన్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమానులు, స్థానికులు, భారీ సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *