రాష్ట్రంలో 3కోట్ల 56లక్షల 29వేల మొబైల్ ఫోన్లతో ఆధార్ తో అనుసంధానం పూర్తి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3కోట్ల 56లక్షల 29వేల 373 మొబైల్ ఫోన్లతో ఆధార్ తో అనుసంధాన(Seeding)ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.గురువారం ఆధార్ పెండింగ్ ప్రాజెక్టులపై అమరావతి సచివాలయంలో ఆయన యుఐడిఏఐ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2021 జనాభా(ప్రొజెక్టెడ్) అంచనాల ప్రకారం 5కోట్ల 28లక్షలు కాగా 5కోట్ల.40లక్షలు (102.3)శాతం ఆధార్ జనరేషన్ జరగ్గా,ఆధార్ జనరేషన్(లైవ్)5.11కోట్లు(96.9)శాతం పూర్తి కాగా ఇంకా 0.17కోట్లు చేయాల్సి ఉందని తెలిపారు.వయస్సుల వారీ ఆధార్ శాట్యురేషన్ పరిస్థితులను పరిశీలిస్తే 0-5మధ్య వయస్సు కలిగిన 2021(Projected)జనాభా 34లక్షల 49వేలు కాగా వారిలో 17లక్షల 34వేల 875 మందికి ఆధార్ జనరేట్ చేసి 50.30శాతం శాట్యురేషన్ ప్రక్రియను పూర్తిచేశారని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.అలాగే 5-18 సంవత్సరాలు మధ్య వయస్సు గల 2021 ప్రొజెక్టెడ్ జనాభా 98లక్షల 17వేలు కాగా వారిలో 98లక్షల 46వేల 362 మందికి ఆధార్ జనరేట్ చేసి 100.30 శాతం శాట్యురేషన్ పూర్తి చేశారని తెలిపారు.అలాగే 18ఏళ్ళు పైబడిన 2021 ప్రొజెక్టెడ్ జనాభా 3కోట్ల 95లక్షల 21వేలు కాగా వారిలో 3కోట్ల 95లక్షల 63వేలు ఆధార్ జనరేట్ చేసి 100.11శాతం శాట్యురేషన్ సాధించడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.
ఆధార్ అథంటికేషన్ కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేసేలా ఆధార్ సేవలు వినియోగించే సంబంధిత శాఖల అధికారులతో వెంటనే ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరుతుందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.నాన్ బయోమెట్రిక్ డేటాను వీలైతే రాష్ట్రానికి ఇవ్వాలని వీడియో సమావేశంలో ఢిల్లీ నుండి పాల్గొన్న యుఐడిఏఐ సిఈఓ సౌరవ్ గార్గ్ ను కోరారు.
యుఐడిఏఐ సిఈఓ సౌరవ్ గార్గ్ ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ త్వరలో ఫేషియల్ రికగ్నెషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.
యుఐడిఏఐ ఎడిజి భాస్కర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రగతిని వివరించారు.వివిధ పాఠశాలలు,అంగన్ వాడీ కేంద్రాల్లో ఏడాది కనీసం రెండు పర్యాయాలైనా ఆధార్ ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ చేయాలని చెప్పారు.ప్రొక్యూర్ మెంట్ ఆఫ్ కిట్స్,యుసిలు సమర్పించడంలో విద్యా,స్త్రీశిశు సంక్షేమం,ఆరోగ్య శాఖలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందని అన్నారు.
ఇంకా ఈసమావేశంలో ఆధార్ కు సంబంధించి వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో విద్యా,స్త్రీశిశు సంక్షేమం,ఐటి శాఖల ముఖ్య కార్యదర్శులు బి.రాజశేఖర్,ఎఆర్ అనురాధ,జయలక్ష్మి,యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సంగీత,సివిల్ సప్లయిస్,గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *