Breaking News

వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో భాగంగా డ్రోన్ సహాయంతో చేస్తున్న రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో ఖాజావలి…

-ఎంపిక చేసిన గ్రామాల్లో అక్టోబరు నాటికి రీ సర్వే పనులుల పూర్తి చేస్తాం…
-చంద్రాల గ్రామంలో 344 సర్వేనెంబర్లలో 1,412.08 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశాం…

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగించి డ్రోన్ సహాయంతో రీసర్వే పనులను వేగవంతంగా చేస్తున్నామని (ఇఛార్జి) ఆర్డీవో ఎన్. ఎస్.కె.ఖాజావల్లి అన్నారు.
శుక్రవారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామంలో రెవెన్యూ, సర్వే అధికారులతో కలసి రీసర్వే పనులను ఆర్డీవో ఖాజావల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకాన్ని ప్రారంభించారన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో గుడ్లవల్లేరు, పామర్రు మండలాల్లోని 50 గ్రామాల్లో క్లస్టర్ మోడ్ లో డ్రోన్ సహాయంతో గ్రామ సరిహద్దులు, భూముల సరిహద్దులను నిర్ణయించే విధంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టి పనులు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గుడ్లవల్లేరు మండలం లో 24 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని ఇప్పటివరకు 8 గ్రామాల్లో వేముగుంట, వేమవరప్పాడు, వేమవరం, నాగవరం, చిత్రం, కూరాడ, చెరువుపల్లి, చంద్రాల గ్రామాల్లో డ్రోన్ ద్వారా రీ సర్వే పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో అక్టోబర్ 16 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. నేడు చంద్రాల గ్రామంలో లో 344 సర్వేనెంబర్లలో 1,412.08 ఎకరాల్లో రీ సర్వే ప్రక్రియను డ్రోన్ సహాయంతో పూర్తి చేశామన్నారు. రీ సర్వే కు గుడివాడ డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అక్టోబరు చివరి నాటికి ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే పూర్తయిన అనంతరం సర్వేపై ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సంబందింత తాహశీల్థారు కార్యాలయంలో తెలియజేయాన్నారు. రీ సర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో డీఐ. సర్వే నరశింహారావు, ఏడీ సర్వే సూర్యారావు, తాహశీల్ధార్ కె.ఆంజనేయులు,మండల సర్వేయర్ బి. రామకృష్ణ,ఆర్ ఐ. అక్బర్ ఖాన్, ఇవో పిఆర్డీ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *