-ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టీసి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక…
-నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎన్నికల పరిశీలకులు యం రాజుబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టి సి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు విద్యార్ధుల భవిష్యత్తుతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు మరియు ఏపి యన్ జిఓ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు యం. రాజుబాబు తెలిపారు. ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ టి సి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికలు శనివారం విజయవాడలోని ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో నిర్వహించారు. జిల్లా కార్యవర్గ ఎన్నికకు ఆగష్టు 13 న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు యం.రామారావు వ్యవహరించారు. ప్రభుత్వ ఐటిఐ అండ్ డియల్ సి జిల్లా అధ్యక్షుడిగా టి.కృష్ణ కిశోర్ కార్యదర్శిగా ఏ.వెంకటరాపు కోశాధికారి వై.శ్రీధర్ ఉపాధ్యక్షులుగా కె. చంద్రశేఖర్ కె.శేషగిరి సంయుక్త కార్యదర్శులుగా వివి రామరాజు ఏ.భాస్కరరావు ఇసి మెంబర్లుగా డిఏ. వేణుగోపాల్ యం. వెంకటేశ్వరరావు యం. ఆనంద్ కుమార్ మహిళా ప్రతినిధిగా పి. వెంకటలక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నూతన కార్యవర్గానికి ఐటిఐ డియల్ టి సి ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘ సభ్యులు జి హరి ధర్మేంద్ర, పి వి రమేష్ బాబు, ఇబ్రహీం, సంఘ నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News