
-ఇసుక సరఫరా నిమిత్తం కైకలూరు లో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు…
-అభివృద్ది అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టరు జె. నివాస్
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో స్థానిక ప్రజాప్రతినిదుల సహకారం తీసుకొని ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు మరియు వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాలపై కలెక్టర్ జె.నివాస్, యంపీ శ్రీధర్, స్థానిక శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావులతో కలసి సమీక్షించారు. సమీక్షా సమావేశానికి హౌసింగ్, పంచాయతీరాజ్, ఉపాధి హామి అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణానికి అవసరమైన రివైజ్డ్ చెల్లింపు విధానాన్ని లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. బెస్ మెంట్ స్థాయికి నిర్మాణం చేరిన వెంటనే బిల్లు సొమ్ము చెల్లింపు జరుగుతుందన్నారు. అదేవిధంగా వారికి కల్పించిన అదనపు రుణసదుపాయం గురించి అవగాహన కల్పించాలన్నారు. లేఅవుట్లులో ఆర్డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖలకు సంబంధించి పనుల్లో ఏవిధమైన జాప్యం వుండరాదన్నారు. లబ్ధిదారుడు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక, సిమ్మెంటు, ఇనుము సరఫరా గురించి తెలియజేయాలన్నారు. ఇంతవరకు ఇళ్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులను గుర్తించి వారు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ ఏఇలు చైతన్య పరచవలసిన బాధ్యత ఉందన్నారు. కైకలూరు నియోజకవర్గంలో గృహనిర్మాణాలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, బల్క్ మిల్కు కేంద్రాల భవనాలు నిర్మాణాలను స్థానిక శాసనసభ్యులు పర్యవేక్షిస్తున్నారని, అధికారులు వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు ఇంకా నిర్మాణాలు చేపట్టని వంటి వాటిని త్వరగా ప్రారంభించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు సంబంధించి అన్నింటికి మొదటి స్లాబు పడలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం లేఅవుట్లను వేసి లబ్దిదారులకు పట్టాలు అందించి అంతర్గత రహదారులు, విద్యుత్, తాగు నీటి సౌకర్యం కల్పించి జగనన్న కాలనీలను అభివృద్ది చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా జగనన్న కాలనీల్లో ఎన్ఆర్ఈ జిఎస్ ద్వారా మెరక పనులు చేశామన్నారు. ప్రతీ ఇంటికి 10 టన్నుల ఇసుక, సిమెంట్, ఐరన్ ముందుగా ఇచ్చి గృహాల నిర్మాణం చేసుకోవాలని లబ్దిదారులకు చెపుతున్నట్లు తెలిపారు. స్టాక్ యార్డుల నుండి ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు లబ్ధిదారులు స్వయంగా రీచ్ నుండి కూడా ఇసుక ఉచితంగా పొందవచ్చన్నారు. గృహనిర్మాణ లబ్దిదారులకు సులువైన పేమెంట్ విధానాలు, కచ్చితమైన చెల్లింపులు చేస్తున్నట్లు లబ్ధిదారుల్లో భరోసా కల్పించాలన్నారు. జిల్లాలో లక్షా 60 వేల గృహాలు మొదటి దశలో నిర్మించాల్సి ఉండగా ఇందులో లక్షా 20 వేల మందికి డిఆర్ డిఏ ద్వారా రుణ సౌకర్యాన్ని అందిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 19 వేల మంది స్వయం సహాయ సంఘాల మహిళలకు గృహ నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసి వారి అకౌంట్లలో జమచేశామన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా 4100 వేల మంది లబ్ధిదారులు తమ గృహాల నిర్మాణాలు మొదలు పెట్టారని కలెక్టర్ తెలిపారు. రూ.1.80లక్షలతో నాణ్యమైన ఇల్లు నిర్మాణం సాధ్యమవుతుందని లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో మాదిరి కాకుండా గృహ నిర్మాణంలో మూడు దశల్లోనే బిల్లు చెల్లింపు ప్రకియ ఉంటుందని కలెక్టరు అన్నారు.
ఏలూరు యంపీ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వని రీతిలో అనువైన స్థలాలు నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిందన్నారు. శాసనసభ్యులు డిఎన్ఆర్ కైకలూరు నియోజకవర్గం అభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రెండు పంటలకు కాలువ శివారు ప్రాంతాలకు కూడా సాగు నీటిని అందించే కృషి చేస్తున్నారన్నారు.
శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరు సర్పంచ్ గా ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ ఆర్ ఆశీస్సులతో నిధులు తెచ్చి వైయస్సార్ కాలనీ ని నిర్మించడం, దానగూడెం లో ఇళ్ల నిర్మాణం, ఎస్టీ కాలనీలో ఇళ్ల నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకు కొంత తన సొంత సొమ్ము వెచ్చించి ఆ రోజు ఇళ్ల నిర్మాణం చేయ గలిగానని, దేవుని దయతో,జగనన్న ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో ఈరోజు ఎమ్మెల్యే గా నియోజకవర్గ స్థాయి లో సుమారు 15000 ఇళ్ళు నిర్మించ బోతున్నామన్నారు.ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలతో మమేకమై, ప్రజలకోసం పనిచేస్తే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని ఆ దిశగా ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని అన్నారు. గతంలో నాయకులు పేద వాడికి ఇంటి స్థలం అంటే కైకలూరు లో ఇంటిస్థలాలు ఇచ్చే భూములే లేవని దాటవేశారని అన్నారు. అయితే మనసుంటే మార్గం ఉంటుందని, మనసుపెట్టి చిత్తశుద్ధితో సుమారు 100 ఎకరాలు సేకరించి మెరక చేయించి సుమారు 3200 మందికి సకల వసతులతో కూడిన లే అవుట్ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టి ముందుకు వెళ్తున్నామని అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారి వెంబడి సుమారు 3 ఎకరాలు స్థలం గ్రామ పంచాయితీకి ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేసి రిజర్వ్ చేయడం జరిగిందని అన్నారు. వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో సుమారు 10 వేల మంది నివసించబోతున్నారని, వారికి కావలసిన అన్ని కాలనీ ముఖద్వారం వద్దనే లభ్యమయ్యే విధంగా గ్రామ పంచాయతీ చే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి లీజ్ కి ఇస్తే వ్యాపారాలు జరిగి,కొంతమందికి ఉపాధి కలిగి, అన్నివిధాల బాగుంటుందనే యోచనతో సదరు ప్రతిపాదన కలెక్టర్ వారి ముందు ఉంచడం జరుగుతుందని, వెంటనే అవసరమైన అనుమతులు ఇచ్చి సహకరించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం కి సమర్ధవంతంగా నాయకత్వం వహిస్తూ..జిల్లా అభివృద్ధి కృషి చేస్తున్న కలెక్టరు జె. నివాస్ కు ధన్యవాధాలు తెలిపాలు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ)డా.కె.మాధవీలత, జాయింట్ కలెక్టర్(హౌసింగ్)శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్,జాయింట్ కలెక్టర్(ఆసరా)మోహన్ కుమార్,డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ రామచంద్రన్,పీఆర్ ఎస్.ఈ ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్.ఈ ఇంచార్జ్ ఆర్డీఓ ఖాజావలి, నియోజక వర్గం లోని 4 మండలాల ఎంపీడీఓ లు, తాహశీల్థార్లు, ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీపీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులు, మార్కెట్ చైర్మన్ లు, వ్యవసాయ సలహా చైర్మన్లు, గ్రామ కార్యదర్సులు,సర్పంచ్ లు,,వెలుగు, ఎన్ఆర్అఈజీఎస్. అధికారులు,ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News