అగ్ని ప్రమాద బాధితులకు మల్లాది విష్ణు పరామర్శ…

-బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురం బుద్ధంరాజు వారి వీధిలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమై నిరాశ్రయులైన బాధిత కుటుంబ సభ్యులను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఘటన స్థలిని పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించి నష్టపరిహారంపై నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్ తో మల్లాది విష్ణు చర్చించారు. తక్షణ సాయంగా రూ. 10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రమాదంలో అగ్నికి ఆహుతైన ఆధార్, రేషన్ కార్డులను కొత్తవి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *