పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు… :  కమీషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదలడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. శుక్రవారం అర్దరాత్రి కృష్ణలంక ప్రాంతములో రోడ్లు పై సంచరిస్తూ ప్రజలకు, పారిశుధ్య నిర్వహణకు అవరోధం కలిగిస్తూ తిరుగుతున్నా 50 ఆవులు మరియు ఆవు దూడలను నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీన పరచుకొని ఆర్.ఆర్.పేట లోని క్యాటిల్ షెడ్ లో పెట్టడం జరిగింద‌న్నారు. ఆవుల యజమానులు అందరు తమ తమ ఆవులను ఐదు రోజులలో లోగా అపరాధ రుసుము చెల్లించి, అఫ్ఫివిట్ లను సమర్పించి ఆవులను తీసుకోని మీ స్వంత స్థలములో కట్టుకోనవలెనని కమిషనర్ ఆదేశించారు. నిర్ధేశించిన‌ గడువు లోపల ఆవులను తీసుకోని వెళ్ళనిచో సదరు ఆవులను నగరపాలక సంస్థ వారు డి.ఆర్.డి.ఏ వారికీ అప్పగించుట జరుగుతుందని పేర్కొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *