Breaking News

సామాజిక పెన్షన్లపై దుష్ప్రచారం…

-1వ తేదీనే 97% శాతం మందికి పెన్షన్స్ అంద‌జేత‌…
-ఎవరికి అవసరమో వారి వారకే పెన్షన్స్ అందించాల‌న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం…
-కావాల‌నే ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయం చేస్తున్నారు…
-మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక పెన్షన్లకు సంబంధించి దుష్ప్రచారం చేస్తోంది, అన్యాయం జరిగిపోతుందన్నట్లు విష ప్రచారంలో భాగంగా పెన్షన్లకు ఎసరు పెడుతున్నారంటూ ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్లపై ఆధారపడి జీవితాలు గడుపుతున్న వృద్ధుల్లో, పెద్దవాళ్లలో అపోహలు పెంచడానికి ప్రయత్నాలు చేసింది ఎవ‌రో అంద‌రికి తెలుసు అని న‌గ‌ర మేయ‌ర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు..

సామాజిక పెన్షన్లపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు కుట్ర జ‌రుగుతుంద‌న్నారు.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎన్నికల ముందే తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ రెండువేలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాచురేషన్‌ పద్ధతిలో అర్హలైనవారికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇప్పుడు రూ.2250 పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వచ్చే అయిదేళ్లలో దశలవారిగా పెంచుకుంటు వెళతామని, అర్హతను బట్టి పెన్షన్లు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుస్తున్నాం నెల తిరిగేసరికి పెన్షన్‌ తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో సంతోషం చూస్తున్నాం అని అన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటున 39 లక్షలు పెన్షన్లు ఇస్తే…

వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నదని చెప్పారు.

బాబు హయాంలో పెన్షన్లకు సగటున రూ.500 కోట్లు ఖర్చు చేస్తే …

దానికి మూడింతలు ఎక్కువగా రూ.1500 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడుతున్నది జ‌గ‌న‌న్న‌ ప్రభుత్వం అన్నారు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో 20585 మందికి 4,95,89000 రూపాయ‌లు

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ లో 24463 మందికి 5,91,20,500 రూపాయ‌లు

విజ‌య‌వాడ తూర్పులో 20428 మందికి 4,94,58,250 రూపాయ‌లు

న‌గ‌రంలో దాదాపు 64055 మందికి 15,10,43,500 రూపాయ‌లు పెన్షన్లు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

పెన్షన్లకు సంబంధించి రెండున్నరేళ్లకు ముందు ఎలా ఉంది… ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఈ ఫలాలను అందుకున్నవారిని అడిగితే చెబుతారు అన్నారు. పిల్లలపై ఆధారపడకుండా వృద్ధులకు ఎంతో కొంత ఆసరాగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. హైదారాబాద్ /బెంగళూరు, ఇత‌ర ప్రాంతాల్లో ఉండి నెలానెలా ఫంచ‌న్లు తీసుకోకుండా ఉన్న వారికి మాత్ర‌మే ఇబ్బంది..

1 లేదా 1.5 % మంది ఎక్కడెక్కడో ఉంటూ ఐదు నెలలకి ఒకసారి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు.

ఇలా పెన్షన్ తీసుకునే వారిలో మాజీ ప్ర‌జాప్ర‌తినిధి తల్లి పేరు లేదా

35 ఎకరాల పొలం /అగ్రవర్ణం / వందల కోట్ల కాంట్రాక్టర్ అయిన కొడుకు ..

ఇలా ఎందరో ఉన్నారు…వారికి మాత్ర‌మే ఇబ్బంది అన్నారు.

సంక్షేమ ప‌థ‌కాల‌కు ఈకేవైసీ ని త‌ప్ప‌నిస‌రిగా కేంద్ర ప్ర‌భుత్వం చేసింది..

అన్ని ప‌థ‌కాల‌కు ఇది త‌ప్ప‌నిస‌రి,

ప్ర‌తినెలా తీసుకునే వారికి ఫించ‌న్లు 1వ తేదీనే 97% శాతం మంది అందిస్తున్నాం అని మేయ‌ర్ సృష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *