-17 వ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
-ఆరోగ్య కేంద్రం లో సదుపాయాలు పెంచుతాం
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయంలో పని చేసే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. శనివారం 46వ డివిజన్‌లో 25లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు మేయర్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. మిల్క్ ప్రాజెక్టు ఎదురు కొండ ప్రాంతంలో పాడైన డ్రైన్లు, మెట్లు అభివృద్ది పనులు మేయర్ ప్రారంభిస్తూ, పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అనంతరం 17వ డివిజన్‌లో రాణిగారితోట శాంపిల్ బిల్డింగ్ లోని ఆరోగ్య కేంద్రం, సచివాలయాలు సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రం లో ప్రజలకు అందుబాటులో గల సదుపాయాలు ఇంకా పెంచుతాం అని తెలిపారు.. అదే విధంగా వ్యాక్సిన్ జరుగుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం 90 మీటర్లు కొత్త పైపుల పనులకు డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తంగిలా రామిరెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోని సిద్దం కృష్ణరెడ్డి కళ్యాణ మండపాన్నికి తగిన మరమ్మతులు చేయించి, మరింత హంగులతో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచిస్తూ, కృష్ణలంక ఫీడర్ రోడ్ నందు సుమారు 70 మీటర్ల పొడవున ప్రహరి నిర్మాణమునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 17 వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి తమ దృష్టికి తీసికొచ్చిన సమస్యలను పరిశీలించి, తర్వలో పరిష్కారిస్తామన్నారు.
కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారావు మరియు ఇతర అధికారులు, సచివాలయ, ఆరోగ్య సిబ్బంది స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొనారు.
Prajavartha Online Telugu News