-ఎమ్మెల్యే ని కలిసిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన డైరెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టించి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన డైరక్టర్ గా నియమితులైన బలిజేపల్లి మాధవీలత ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మల్లాది విష్ణు ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాధవీలత దంపతులను ఎమ్మెల్యే సత్కరించి అభినందనలు తెలిపారు. మహిళ సాధికారత దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. 50 శాతానికి పైగా పదవులు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. బాధ్యతాయుతంగా నిజాయతీతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాధవీలత దంపతులు గౌరవ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.