భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేయాలి… : కలెక్టర్ జె. నివాస్

-స్వరాజ్య మైదానంలో ఖాళీ చేసిన భవనాలను యుద్ధప్రాతిపదికపై తొలగించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్వరాజ్య మైదానంలో భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతోపాటు స్మృతివనం పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక స్వరాజ్య మైదానాన్ని సందర్శించి డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. సుమారు 20 ఏకరాల విసీరణంలో రూ. 249 కోట్ల రూపాయలతో డా.బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షణకు సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ ఏజన్సీగా నియమించింది. ఏపి ఐఐఎస్ సి కూడా పనుల నిర్వహణతో కూడా భాగస్వామ్యం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం నాటికి స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, స్మృతివనం, అధ్యయన కేంద్రాలు వంటివి ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన కార్యచరణ అమలు చేయాలన్నారు. స్మృతివనం ఏర్పాటుకు ఇప్పటికే స్వరాజ్య మైదానంలో ఉన్న వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను తరలించడం జరిగిందన్నారు. ఇప్పటికే శిధిలావస్థ, నిరుపయోగంలో ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ ను తొలగించడం జరిగిందని అయితే ఖాళీ అయిన మిగిలిన భవనాలను కూడా త్వరితగతిన తొలగించి స్మృతివనం పనులను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ డిడి కె. సరస్వతి, ఇరిగేషన్ కెసి డివిజన్ డిఇ ఏ రాజా స్వరూప్ కుమార్, తహాశీల్దార్ వి. శ్రీనివాస్, ప్రాజెక్టు మేనేజర్ సి సురేష్ బాబు, డిజ యం కిషోర్ తదితరులు ఉన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *