Breaking News

మేయర్ అద్యక్షతన స్థాయీ సంఘ సాధారణ సమావేశము…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము, మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, తదితరులు సమావేశంలో ఉన్నారు. సదరు సమావేశంలో 24 అంశాలపై చర్చించి 17 అంశాలను ఆమోదిస్తూ, 3 అంశాలు వాయిదా, 1 అంశము పరిశీలన నిమిత్తం వాయిదా వేయటo జరిగింది. పరిపాలన పరమైన అంశాలకు సంబందించి 1 అంశమును ద్రువికరించుట మరియు 2 అంశాలను ర్యాటి మరియు రికార్డు చేయుటం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కేంద్ర సహకారం.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతికి మహర్దశ

-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *