Breaking News

జిఎంసి కళ్యాణ మండపాలు, కమ్యూనిటి హాల్స్ బహిరంగ వేలం వాయిదా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ స్వచ్చ భారత్ మిషన్ బృందం ఈ నెల 16న గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటన దృష్ట్యా అదే రోజు (16వ తేదీన) జరగాల్సిన గుంటూరు నగర పాలక సంస్థ కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ బహిరంగ వేలాన్నివారం రోజులు పాటు వాయిదా వేయడం జరిగిందని, తదుపరి వేలం నిర్వహించే తేదిని త్వరలో ప్రకటిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ ఆదాయ వనరుల పెంపులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి పాత గుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపం, కాపు కమ్యునిటీ హాల్, భారత పేటలోని మదర్ థెరిసా కమ్యునిటీ హాల్, పొన్నూరు రోడ్డులోని లాల్ జాన్ బాషా షాదీఖానాలకు నెల సరి అద్దె ధరావత్తుతో 2025-26 సంవత్సరానికి సంబందిచి బహిరంగ వేలం ఈ నెల 16న నిర్వహించడానికి ఆగస్ట్ 25న పత్రిక ప్రకటన విడుదల చేయుట జరిగిందన్నారు. అదే రోజు కేంద్ర బృందం నగరంలో పర్యటన కారణంగా ఈ బహిరంగ వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, త్వరలో వేలం జరిగే తేదీలని ప్రకటిస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *