దళారి వ్యవస్థను నిర్మూలించి రైతులకు గిట్టుబాటు ధరతోపాటు మార్కెటింగ్ సౌకర్యం…

-నాబార్డు సిజియం సుధీర్ కుమార్ జన్నావర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతాంగం పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కృషి చేయాలని నాబార్డు సీజియం సుధీర్ కుమునార్ జన్నావర్ అన్నారు.
మంగళవారం విజయవాడలోని మురళీ ఫార్చూలో నిర్వహించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల అవగాహనా సదస్సుకు నాబార్డు సిజియం ముఖ్యఅతిథిగా హాజరై సంఘ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డు సంస్థ రాష్ట్రంలోని రైతాంగానికి వివిధ బ్యాంకులు ద్వారా అందిస్తున్న పంటరుణాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటే దళారీ వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు పటిష్టంగా ఉన్నప్పుడే రైతులకు ప్రయోజనాలు చేకూరగలవన్నారు.. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులు పండించే పంటల్లో లాభాలు వచ్చేలా వ్యాపారలావాదేవీలపై దృష్టి పెట్టాలన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు ద్వారా రైతులు వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేలాగా మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పంటరుణాలు బ్యాంకులు ద్వారా అందించడంలో.. ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో నాబార్డు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. రైతులకు అవసరమైన రుణాలను అందించేందుకు రాష్ట్రంలో అన్ని బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. అనంతరం సుధీర్ కుమార్ జన్నావర్ గుంటూరు జిల్లా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులకు నాబ్ కిషన్ పధకం క్రింద రూ. 12.5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు జనరల్ మేనేజర్ యయస్. మూర్తి, యయల్ బిసి కోఆర్డినేటర్ బ్రహ్మానంద రెడ్డి, ఆప్కాబ్ యండి ఆరియస్. రెడ్డి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన య ఏయం, యన్ సిడిఇఎక్స్, ఏపిఇడి ఏ సభ్యులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, రైతు ఉత్పత్తి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *