అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి పట్టణంలో గల ఇందిరా నగర్ 4వ సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ఆర్కే క్లాప్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని ఇంటి ఇంటికి తిరిగి ఎమ్మెల్యే ఆర్కే, MTMC అధికారులు డస్ట్ బిన్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ పర్యావరణం, పరిశుభ్రంగా ఉండాలని CM జగన్మోహనరెడ్డి క్లాప్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రాంభించారని అన్నారు. దాదాపు 1 కోటి 70 లక్షల రూపాయలతో MTMC పరిధిలో ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్లను అందజేయటం జరుగుతుందని. తడిచెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త ఇలా 3 రకాలుగా వేయటానికి 3 రంగులలో పేర్లు రాసి మరి అందించటం జరుగుతుందని అన్నారు. రేపటి నుండి అన్ని సచివాలయాల పరిధిలో ఇంటి, ఇంటికి తిరిగి సచివాలయ సిబ్బంది అందజేస్తారని అన్నారు. ప్రజలు కూడా పర్యావరణం పట్ల బాధ్యతగా మెలగుతూ తడి చెత్తని, పొడి చెత్తని, ప్రమాదకర చెత్తని వేరు వేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేసి పారిశుధ్య కార్మికులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు వారికి అందజేయాలని అన్నారు.
Prajavartha Online Telugu News