విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ హిస్టారికల్ అకాడమీ నూతన డైరెక్టర్ గా నియమితులైన వాజిత్ ఖాన్ ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే సత్కరించి అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవులు, అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కే దక్కుతుందన్నారు. తద్వారా ఆయా వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా నిజాయతీతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గారిని కలిసిన వారిలో రెహ్మాన్, షంషేర్, సుభాని, అలీ, షబ్బీర్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News