-మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని A.K.T.P.M. హైస్కూల్ నందు APWJU ఆధ్వర్యంలో చేపట్టిన ‘సీఎం వైఎస్ జగనన్న జర్నలిస్టుల పచ్చతోరణం’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాలకు నగర ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో పాత్రికేయ మిత్రులు సైతం ముందుకొచ్చి మొక్కలను నాటడం హర్షణీయమన్నారు. APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి సూచనలతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో జర్నలిస్ట్ సోదరులు 2వేల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. అటువంటి పాత్రికేయ మిత్రుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఇటీవల ఆనందయ్య మందును పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్టణాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. మొక్కల పెంపకాన్ని ఒక మహా యజ్ఞంలా చేపట్టవలసిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. మొక్కలు నాటడం ద్వారా భారీ ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చన్నారు. కనుకనే కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న 17వేల లేఅవుట్ లలోనూ తప్పనిసరిగా మొక్కలు పెంచాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విధించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లోనూ ఈ వర్షాకాలంలో కనీసం వెయ్యి మొక్కలు నాటే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం, కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడాలంటే.. మొక్కలను పెంచడమే మార్గమని వ్యాఖ్యానించారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్ధలు సైతం పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. తత్ఫలితంగా విజయవాడ నగరమంతా పచ్చదనం పరిఢవిల్లుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు టి.గోపాలకృష్ణ, చాంద్ శర్మ, చామర్తి మూర్తి, కె. మారుతి, భాగ్యారావు, కె.ఫణి, APWJU కృష్ణ, విజయవాడ అర్బన్ శాఖ కన్వీనర్ షేక్ నాగూర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పోతిన వాసు, టేకుమూడి అశోక్ కుమార్, వైఎస్సార్ సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News