Breaking News

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ, శంఖుస్థాపన కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఐ.పంగిడి గ్రామంలో రూ. 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ను, రూ.198 లక్షలతో నిర్మించిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. దేచేర్ల గ్రా మంలో రూ.124.80 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైన్స్ శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో కూడి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొవ్వూరు మండలం లోని ఐ. పంగిడి గ్రామంలో రహదారుల ను, విద్యుత్తు సబ్ స్టేషన్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకుని వొచ్చామన్నారు. ఐ. పంగిడి గ్రామం లో ప్రజల అవసరాల కోసం మరో వి ద్యుత్ సబ్ స్టేషన్ కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో క్వారీలు ఉన్నాయని, విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటున్నదని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజా ధనముతో చేపడుతున్న ఆయా మౌలిక సదుపాయాల వాటి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యం గా సామాజిక బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎటు ల్వంటి ఇబ్బందులు ఉండకూడదని ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవ్వూరు మండల రైతు ఉత్పత్తి దారుల సంస్థ ద్వారా రైతులకు కాపవరం లో 25 వేల రూపాయల చెక్ ను మంత్రి అందించారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు పండించే పంటలకు సరైన మద్దతు ధర అందించడం, వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. నాణ్యమైన వ్యవసాయ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు నిపుణుల సూచనలు, సలహాలు అందించడం ద్వారా వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలుగా ఆర్భికెలు సేవాలందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ., పి. జగదాంబ, వ్యవసాయ శాఖ ఏ.డి., పి. చంద్రశేఖర్, వి. శ్రీనివాస రావు, ఉప్పులూరి వెంకట ఫణి కృష్ణా రావు( నానాజీ) చౌటిపల్లి వీరన్న గోసాల నాగార్జున, గ్రామ సర్పంచ్ కోమటి కృష్ణంరాజు, సుంకర సత్యనారాయణ, ఎస్. ఇ, ఏ. పి. ట్రాన్స్ కో, ఎస్. జనార్థన రావు, ఈ ఈ, బి. వీరభద్ర రావు, డి. ఈ ఈ, పి. అచ్యుతా చారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *