విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టి నూతన రోడ్ల నిర్మాణాన్ని చేయవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు అనేక అవసరాల నిమిత్తం వచ్చి వెళుతూ ఉంటారు రాజధాని నగరం అయినందున ఈ నగరం యొక్క పేరు ప్రతిష్టలను పెంచవలసినటువంటి బాధ్యత అందరిపైనా ఉన్నది. ముఖ్యంగా కమిషనర్ విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గోతులు మయంగా మారినవి అని తమరికి తెలియజేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రజలు గోతులు పడ్డ రోడ్ల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమరు తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన ప్రతి ప్రాంతం నందు నూతన రోడ్ల నిర్మాణము చేపట్టవలసిందిగా తెలియజేస్తున్నాము. సెప్టెంబర్ 2, 3, 4 ,తేదీల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అనేక ప్రాంతాల్లో రోడ్లు పాక్షికంగా మరియు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులను గమనించినాము, అదేవిధంగా మేము ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ అప్పుడు ప్రజలు వారి ఇబ్బందులను తెలియజేసినారు. గోతులు పడ్డ రోడ్ల వలన వాహనాలు పాడై పోతున్నాయి అని , నీరు నిలిచి పోయినప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఆటోలు నడపడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కావున తమరు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగంగా రహదారుల మరమ్మతు చేపట్టి అవసరమున్న ప్రతిచోట కూడా నూతన రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టవలసిందిగా కోరుతున్నాము. అధికార పార్టీ నాయకులు విజయవాడ నగరం లో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపడుతున్నామని పదేపదే చెబుతున్నారు గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రాని అధికార పార్టీ నాయకులు విజయవాడ నగర అభివృద్ధి ని ఏ విధంగా చేస్తారో ప్రజలకు మరియు మా పార్టీ నాయకులు కూడా సందేహంగా ఉన్నది. తమరు నిజాయితీ గలిగిన అనుభవం ఉన్నటువంటి యువ ఐ.ఎ.ఎస్ అధికారి తమరు తప్పక ప్రజల యొక్క ఇబ్బందులను వెంటనే పరిగణలోకి తీసుకొని రోడ్లకు మరమ్మతులు చేప్పటి నూతన రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టవలసిందిగా మిమ్మల్ని మిక్కిలి ప్రార్థిస్తున్నాము. 1. నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ ప్రాంతం వరకు, 2. సితార సెంటర్ కూడలి వద్ద,3. విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్,4. చర్చి సెంటర్ వద్ద నుండి 16 అంతస్థుల బిల్డింగ్ ఊర్మిళ నగర్ సెంటర్ వరకు,5. కరెంట్ ఆఫీస్ రోడ్డు6. అరండల్ పేట, 7. సత్యనారాయణపురం 8. గుణదల 9. బెంజ్ సర్కిల్ వద్ద గల వి గ్రిల్ రోడ్డు10. ఐదవ నెంబర్ రూట్ 11. సింగినగర్ ప్రధానంగా తమ దృష్టికి తీసుకు వస్తున్నాం . కమిషనర్ కి వినతి పత్రం సమర్పించిన వారు జనసేన విజయవాడ నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, కార్యదర్శులు వెవిన నాగరాజు, కొరగంజి వెంకటరమణ , ధార్మిక మండలి సభ్యులు తమ్మిన రఘు, బొలిశెట్టి వంశీ, కోపిశెట్టి వెంకటేశ్వరరావు, పొట్నురి. శ్రీను,k. సాంబ,p. నాగరాజు తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News