విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 67 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రజలనుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలనుంచి స్వీకరించిన ఆర్జీలకు సత్వర పరిష్కరం చూపించాలని ఆయా శాఖల అధికారులకు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సూచించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 26, పురపాలక 16, పంచాయతీరాజ్ 17, పౌర సరఫరా 6, పోలీస్ 5, బిసి వెల్ఫేర్ 2, ఇతర అన్ని శాఖలకు సంబంధించి మరో 5, ఆర్జీలు కలిపి మొత్తం 67 అర్జీలు స్పందన ద్వారా దరఖాస్తులు అందాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఆర్జీలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. స్పందనలో అందిన వినతుల్లో కొన్నింటిని అక్కడికి అక్కడే సంబంధిత తహాశీల్దార్లకు, ఫోన్ చేసి పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన సత్తాల పుష్పలత వినతి పత్రం ఇస్తూ తాము గతంలో అద్దెకు వున్న ఇంటి యజమాని తమ ఆధార్ కార్డుపై విద్యుత్ సర్వీసు పొంది ఉన్నారని దీని మూలంగా తమ రేషన్ కార్డు రద్దు అయిందన్నారు. తమ ఆధార్‌పై ఉన్న విద్యుత్ సర్వీసు రద్దుపరచి రేషన్ కార్డు పునరుద్ధరించాలని కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ సమగ్ర పరిశీలన చేసిన పిమ్మట సంబంధిత విద్యుత్ సర్వీసు ఆ ఇంటి యజమానికి బదలయించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపి ఆపిడిసిఎల్ అధికారులను ఆదేశించారు. ఆ
విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన బొంతు నాగిరెడ్డి వినతి పత్రం ఇస్తూ తమ పోలానికి సంబంధించి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని రూరల్ తహాశీల్లార్ పై సట్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆదేశించారు
విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీ చెందిన తంప శ్రీనివాసరావు వినతి పత్రం ఇస్తూ వికలాంగుడైన తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అద్దె ఇంటిలో నివాసిస్తున్నమన్నారు. తనకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని తన కుటుంబానికి సొంత ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకోవాని రూరల్ తహాశీల్లారు సబ్ కలెక్టర్ ఆదేశించారు.
