ఏపి ఎప్ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్…

-ఎప్ సెట్ ఫలితాల్లో అర్హత సాధించిన 72488 మంది విద్యార్థులు….
-ఫలితాలను వెబ్ సైట్లో పొందుపరిచిన విద్యాశాఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రికల్చరల్ ఫార్మశీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపి ఎప్ సెట్ ఫలితాల్లో 72488 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
మంగళగిరిలోని ఏపియస్సీ హెచ్ కార్యాలయం నందు మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపి ఎప్ సెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 3, 6 మరియు 7 వ తేదీ ఏపి ఎప్ సెట్ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. 3 రోజులుపాటు 5 సెషన్స్ లో 84 పెంటర్ల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 83,820 మంది విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని వీరిలో 78,066 మంది పరీక్షలకు హాజరు కావడం జరిగిందన్నారు. పరీక్షకు హాజరైన వారిలో 72,488 మంది విద్యార్థినీ విద్యార్థులు అనగా 22.85 శాతం అర్హత సాధించారన్నారు. పరీక్షా ఫలితాలను గతంలో ఎన్నడూ లేనివిధంగా 7 రోజుల రికార్డు సమయంలో వెల్లడించామన్నారు. పరీక్షల అనంతరం ఆ లైన్లో ‘కీ ‘ ను ఉంచడం జరిగిందన్నారు. విద్యార్థుల నుండి వచ్చి అభ్యర్థనలను కీ అబ్జెక్షన్స్ వెరిఫికేషన్ కమిటీ పరిశీలించి వారి సందేహాలను వివృత్తి చేసి ఫలితాలను ప్రకటించినట్లు తెలిపారు. 5 పెషనకు సంబంధించి 5 రకాల క్వచ్చిన్ పేపర్లను కమిటీ రూపొందించడం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాలలో సమతుల్యం పాటిస్తూ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ప్రశ్నాపత్రాలను తయారు చేసి పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో మెడికల్ ఇంజినీరింగ్ కోర్ల కొరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించేవారమని మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్లినతర్వాత తొలిసారిగా ఏపి ఎపి సెల్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడంలో సంబంధిత అధికారులు అత్యంత ప్రతిభను కనబరిచారన్నారు. ఈనెల 15వ తేదీ నుండి విద్యార్థులు ర్యాంకు కార్డులను వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ పరీక్షలను నిర్వహించడంలో జెయమైయు కాకినాడ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతోపాటు జిల్లాల యంత్రాంగం పోలీస్ ఆర్ లిపి, మెడికల్ తదితర శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ఎంతో సహకరించారన్నారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో ఐదుగురు విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని, అయితే ఈ అగ్రికల్చరల్ ఫార్మశీ పరీక్షలో ఏ ఒక్క విర్యార్థి కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కాలేదని మంత్రి వివరించారు.
ఏపి ఎప్ సెట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకు సాధించిన విద్యార్థుల వివరాలు…
ఏపి ఎప్ సెట్ ఫలితాల్లో తూర్పుగోదావరికి చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంకును, అనంతపురం జిల్లాకు చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ రెండవ ర్యాంకును, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాసరావు 3వ ర్యాంకును, రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లికి చెందిన గట్టెల సామె హెనారెడ్డి 4వ ర్యాంకును, హైదరాబాద్ ప్రగతినగర్ కు చెందిన కాపా లహరి 5వ ర్యాంకును, గుంటూరుకు చెందిన కాసిందుల చైతన్యకృష్ణ 6వ ర్యాంకును, గుంటూరుకు చెందిన నూతలపాటి దివ్య 7వ ర్యాంకును, సిద్దిపేటకు చెందిన కళ్యాణం రాహుల్ సిద్ధార్ల రివ ర్యాంకును, నల్గొండ జిల్లా గరిడేపల్లికి చెందిన తడిసిన సాయి రెడ్డి 9వ ర్యాంకును, గుంటూరుకు చెందిన గద్దే విరిస్ 10వ ర్యాంకును సాధించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.
ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపి హెచ్ ఆర్ ఎం సి ఛైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య, తెలుగు సంస్కృత అకాడమి ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏపియస్ పి హెడ్స్ ఛైర్మన్ ప్రొఫెసర్ 3. హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు టి.లక్షమ్మ, ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు , కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ సిఇటియస్ స్పెషల్ ఆఫీసర్ యం. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *