Breaking News

రాష్ట్రంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి…

-మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయి…
-దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్  విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి క జనసేన పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , మహిళా నాయకులు , కార్పొరేటర్లు గా పోటీ చేసిన అభ్యర్థులు, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళ నాయకురాలు మల్లెపు.విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయనీ, మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయని, దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందనీ, నేరస్తులు విచ్చలవిడిగా ధైర్యంగా రోడ్లపై తిరుగుతున్నారని. మహిళలు అంటే cm జగన్ గారికి గౌరవం లేదనీ,మహిళల భద్రత రక్షణ గాలికి వదిలేశారని.మహిళ రక్షణ జగన్ గారి పాలనలో ప్రచారానికే పరిమితం అయిందని, దిశ చట్టం వలన ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, దిశ చట్టం వల్ల ఒక్కరికైనా శిక్షలు వేశారని ఒక్కరైనా సరే సకాలంలో కాపాడగలిగారాని? ఆన్నారు.నగర ఉపాధ్యక్షులు వెన్న.శివశంకర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చేసే కార్యక్రమాల్లో రికార్డింగ్ డాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ఎక్కువ అయ్యాయనీ,ముఖ్యమంత్రి గారు ,డిజిపి గారు, హోం మినిస్టర్ గారు నివాసం ఉండే గుంటూరు జిల్లా లో మహిళల పై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఇంకా రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏవిధంగా ఉంటుందని?దివ్య తేజస్విని ఘటనలో గాని, రమ్య ఘటనలో గాని ,సీతానగరం ఘటనలో గాని దోషులు కనీసం పట్టుకొని శిక్షించ గలిగారని.రాజధాని అమరావతి కోసం ఉద్యమించిన మహిళలపై మానవత్వం లేకుండా ఈడ్చిపడేసిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు.నాయకులు బోల్లిసెట్టీ. వంశీ కృష్ణ మాట్లాడుతూ వైయస్ జగన్ గారి పాలనలో నేరస్తుల కి భయం లేకుండా పోయిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ జగన్ గారి పాలనలో సాధ్యమయ్యే పనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర ఉపాధ్యక్షులు వెన్న శివ శంకర్, కమలా స్వామినాథన్, సయ్యద్ మొబిన, బొలిశెట్టి వంశీకృష్ణ,విజయ్ కుమారి, కృష్ణ మోహన్, ఆలియా బేగం, కామేశ్వరి శిరీష, రేవడి రమాదేవి, ఉదయలక్ష్మి, రాజ్యలక్ష్మి,ఉమా మహేశ్వరి, రాణి ,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ అభా ఐడీతో చికిత్సను అందించాలి

-ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు అమలు తప్పనిసరి -ఈహెచ్‌ఆర్‌ నమోదుతో రోగి ఆరోగ్య చరిత్ర భద్రం -వినియోగంపై ఎన్ ఎం సి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *