త్వరలో అందుబాటులోకి వెట‌ర్న‌రీ కాల‌నీ పార్క్… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం పెంపొందించాల‌ని, చిన్నారుల‌కు ఆకర్షించే విధంగా అత్యంత సుంద‌రంగా పార్క్ ల‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ 4వ డివిజ‌న్ గురునాన‌క్ కాల‌నీ, వెటర్నర్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. వెటర్నర్ కాలనీ చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న 4 మీట‌ర్లు బీటి రోడ్డును 5 -1/2 వెడ‌ల్పు చేసి బి.టి రోడ్డుగా అభివృద్ధి పరచాలని అధికారుల‌కు అదేశించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మ‌ట్టి దిబ్బ‌ల‌ను, ర్యాంపుల‌ను పూర్తిగా తొల‌గించాల‌న్నారు. డ్రైన్లు పూడిక‌ తీయుపనులు పూర్తి చేయాల‌న్నారు. వెటర్నర్ కాల‌నీ 10ల‌క్ష‌ల రూపాల‌య‌ల‌తో ఏర్పాటు చేయ‌నున్న ఇండోర్ జిమ్‌, ఓపేన్ జిమ్ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. పార్కును ఈ నెల ఆఖ‌రులోపు పూర్తి చేసి, వ‌చ్చే నెల నుంచి సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను క‌మిష‌న‌ర్ అదేశించారు. ఆయా ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము, చెత్త సేకరణ మొదలగు అంశాలతో పాటుగా డ్రెయినేజి పంపింగ్ స్టేషన్ యొక్క పనితీరును పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప‌ర్య‌ట‌న‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీ దేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారావు మరియు శానిటరీ అధికారులు మరియు స్థానిక కాలనీ వసూలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *