విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్సు కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప నిర్మాణాలను చేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  తెలిపారు. దేవతలచే పూజలందుకొన్న భగవాన్ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని పేర్కొన్నారు. విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడికి.. విశ్వ బ్రాహ్మణులు వారసులుగా ఎమ్మెల్యే  వ్యాఖ్యానించారు. విశ్వబ్రాహ్మణలు లేని వృత్తి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు సుమారు 25లక్షల మంది ఉన్నార‌ని.. వారందరు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో విశ్వబ్రాహ్మణులకు ముఖ్యమంత్రివర్యులు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు.. బీసీ సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు  శైలజారెడ్డి, అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు చిప్పాడ చందు, కృష్ణా జిల్లా సర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి దమర్ సింగ్ ప్రకాష్, వైఎస్సార్ సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు, అలంపూర్ విజయ్, ఇసరపు రాజారమేష్, బంకా భాస్కర్, యర్రగొర్ర శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *