132 మంది గిరిజన విద్యార్థులకు స్కూలు బ్యాగు, యూనిఫాం, టీషర్టు, టెస్టు పుస్తకాలు, నోటు పుస్తకాలు, టై, బెల్టు, స్కూలు లోగోల పంపిణీ…

విజయవాడ/మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మండలంలోని లీలావతి అప్పర్ (ప్రైమరీ పాఠశాల నందు చదువుతున్న 132 మంది గిరిజన విద్యార్థులకు స్కూలు బ్యాగు, 2 జతల యూనిఫాం, టీషర్టు, టెస్టు పుస్తకాలు, నోటు పుస్తకాలు, టై, బెల్టు, స్కూలు లోగోలను శుక్రవారం కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య పంపిణీ చేశారు. ఈ పాఠశాల గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరు చేయబడుతున్న గ్రాంటు ఇన్ ఎయిడ్ నిధుల ద్వారా శ్రీ లక్ష్మి మహిళా మండలి మైలవరం వారిచే నిర్వహించబడుతుందన్నారు. ఇందులో ప్రస్తుతము 132 మంది విద్యార్థులు 1 నుంచి 7వ తరగతి వరకు విద్యా సభ్యశించున్నారని ఆయన తెలిపారు. ఈ పాఠశాల డేస్కాలర్ స్కూలుగా నిర్వహించబడుతుందని, నిర్వహణ తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షకులు సృజన, ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు తదితరలు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *