విద్యార్థులు కాన్సెప్ట్ ను అర్ధం చేసుకొని చదవాలని మార్కులకన్నా విషయం పరిజ్ఞానం పెంచుకోవాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెట్రరీ కే. సునీత  ఈ రోజు పామర్రు లోని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల తరగతి గదులు, వసతి గృహము, భోజన శాల, ఆవరణ శుభ్రతను పరిశీలించారు. శుభ్రతను, విద్యార్థుల వసతిని మెరుగుపరచుకోవాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలను నిర్వహించాలని, తరగతి గదిలో వసతి గృహములోని గదులలో 20 మందికి మించి ఉంచరాదని సూచించారు. విద్యార్థులు కాన్సెప్ట్ ను అర్ధం చేసుకొని చదవాలని మార్కులకన్నా విషయం పరిజ్ఞానం పెంచుకోవటం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు బోధనా పద్దతులను మెరుగుపరచుకోవాలని, విద్యార్థులకు అవగాహన అయ్యేలా బోధించాలని సూచించారు. విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అదనపు సమయాన్ని కేటాయించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల పఠనా సామర్ధ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదగాలని స్కూల్ స్థాయిలోనే వారి బంగారు భవితకు పునాదులు వేసుకోవాలని తెలియచేసారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *