Breaking News

వుమెన్ క్రికెట్ మ్యాచ్ కోసం దేశంలోనే మొద‌టి సారిగా విజ‌య‌వాడ‌లో ఫ్యాన్ పార్క్

-ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇందిరా గాంధీ స్టేడియంలో ఫ్యాన్ పార్క్
-ఐసీసీ వుమెన్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫైన‌ల్ మ్యాచ్ ఇండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా
-ఫైన‌ల్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంలో భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్లు ఏర్పాటు
-స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు అంద‌రూ ఆహ్వానితులే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా క్రికెట్ ను ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ దేశంలో ఎక్కడా లేని విధంగా మొద‌టి సారిగా మ‌హిళ క్రికెట్ మ్యాచ్ కోసం ఫ్యాన్ పార్క్ ను విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో ఆదివారం నవీ ముంభై వేదిక గా జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇందిరా గాంధీ స్టేడియంలో ఫ్యాన్స్ పార్క్ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు . మహిళా క్రికెట్ ను ప్రోత్సహించే విధంగా ఫ్యాన్ పార్క్ విజయవాడలో పెడుతున్నట్లు తెలిపారు. …క్రికెట్ అభిమానులు అంద‌రూ ఇండియా-సౌతాఫ్రికా ఫైన‌ల్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంలో అతి పెద్ద ఎల్.ఈ.డీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానుల‌తోపాటు న‌గ‌ర‌వాసులంద‌రి ఆహ్వానితులే అని తెలిపారు. ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో ఇండియా త‌రుఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన యువ ప్రతిభావంతురాలు శ్రీ చరణి ఆడ‌టం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు. ఇంధిరాగాంధి స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ ను స్క్రీన్స్ మీద చూసి టీమిండియా కు సపోర్ట్ గా నిల‌వాల‌ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *