విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ యోగ శక్తి సాధన సమితి విభాగ సంస్థ ఎస్ఫా భారత్ (ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ )ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ఉత్సవాలను నవంబర్ ఒకటవ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ కార్యక్రమాలను గురించి విషిదికరించారు.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ‘ఆక్యుపంక్చర్ ను సమర్థవంతమైన చికిత్సగా గుర్తించింది’. యునెస్కో ‘అక్యుపంక్చర్ ను మానవత్వపు సాంస్కృతిక వారసత్వ వైద్యంగా గుర్తించింది’ భారత ప్రభుత్వం ‘ఆక్యుపంక్చర్ ను స్వతంత్ర ప్రతిపత్తి చికిత్స విధానంగా గుర్తింపు ఇచ్చింది’.యోగ శక్తి సాధన సమితి ఆక్యుపంక్చర్ ను మందు రహిత, రుగ్మతల మరియు సర్జరీలను నివారించే వైద్యంగా గుర్తించి,ప్రజల్లో అవగాహన చికిత్స, శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ 16 రోజుల ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి సత్య కుమార్ యాదవ్ బ్రోచర్ ప్రారంభించి ప్రోత్సహించినట్లు తెలిపారు.నేటి నుండి ఈ ఉత్సవాలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో కాలేజీలలో, ప్రార్థన స్థలాలలో ఆక్యుపంక్చర్ అవగాహన, చికిత్స మరియు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూతపాటి ఉదయ్ కుమార్, కొండవీటి సుమతి, షేక్ ఆశ్రపున్నిశ ఇంకా అనేకమంది ఎస్పా భరత్ టీం సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News