త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి చర్యలు…

-ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టేక్ హోల్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలన్నీ తీసుకున్నాం
-ఆన్లైన్ టికెట్ల అంశంపై స్టేక్ హోర్డలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు
-రాష్ట్ర సమాచార,రవాణాశాఖమాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విధానం అనేది 2002 వ సంవత్సరం నుండి అమలుకు నోచుకోకుండా ఉన్న అంశమని పేర్కొన్నారు.ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేయడం జరుగుతోందని చెప్పారు.దానిలో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిలిమ్ చాంబర్ ప్రతినిధులు అనగా నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు తదిర స్టేక్ హోల్డర్లతో సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు.ఆన్లైన్ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభిప్రాయాన్నివ్యక్తం చేయడంతో పాటు సినిమా రంగానికి సంబంధించి అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారని వాటన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకవెళతామని మంత్రి నాని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ప్రేక్షకులందరికీ పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల ప్రకారం వినోదాన్ని అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆదిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనుందని మంత్రి పేర్ని వెంట్రామయ్య మీడియాకు వివరించారు.రాష్ట్రంలోని కొన్ని ధియేటర్లలో ఇప్పటికే పేటియం,బుక్ మై షో వంటి వాటిద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయం చేస్తున్నారని చెప్పారు.అన్నిధియేటర్లలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు.తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిలిమ్ చాంబరుకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పలు సూచనలు,సలహాలు,సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని వాటిని పరిశీలించి ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు.
అంతకు ముందు సచివాలయం 5వ బ్లాకులో ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంపై తెలుగు ఫిలిమ్ చాంబరుకు చెందిన స్టేక్ హోల్డర్లు అనగా నిర్మాతలు,పంపణీ దారులు, ఎగ్జిబిటర్లు తదితురులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు విజయచందర్, రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ మరియు రాష్ట్ర ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి టి.విజయకుమార్ రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఎపి డిజిటల్ కార్పొరేషన్ సిఇఓ వాసుదేవ రెడ్డి, ఎపి తెలుగు ఫిలిం చాంబరుకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తదితర ప్రతినిధులు సి.కళ్యాణ్, ధిల్ రాజు, జి.ఆది శేషగిరిరావు, వంశీ మొదలైన వారు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *