సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి చేసిన మేయర్, కమిషనర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం నందు ఏర్పాటు చేసిన సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి కార్యక్రమములో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, మేయర్ రాయన భాగ్య లక్ష్మి పాల్గొన్నారు. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శ్రీ ద్వారా సిబ్బందికి మెడికల్ ఎక్యూప్ మెంట్స్ అందజేసారు. నగర పరిధిలోని 286 సచివాలయంలో గల హెల్త్ సెక్రెటరీ లకు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ వారు అందించిన మెడికల్ ఎక్యూప్ మెంట్స్ బి.పి.మిషన్, డిజిటల్ ధర్మ మీటర్స్, మాస్క్ మరియు నగరపాలక సంస్థ ఆరోగ్య శ్రీ ద్వారా అపరాన్, హేమోగోబిన్ టెస్ట్ లతో కూడిన మెడికల్ కిట్స్ లను మేయర్ మరియు కమిషనర్ పంపిణి చేసారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ కోవిడ్ విపత్కర సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారు చేసిన సేవలను మరియు వ్యాక్సినేషన్, కొవిడ్ టెస్టింగ్ సమయాలలో వారు చేసిన అందించిన సేవలను కొనియాడుతూ ఇదే స్పూర్తి తో రాబోవు రోజులలో కూడా సేవలను అందించాలని సూచించారు. కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతభాయి, వరల్డ్ విజన్ ప్రోగ్రాం మేనేజర్ డా.అన్న, సచివలయాల ఇన్ ఛార్జ్ అధికారి డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *