అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలని అధికారులకు సూచన…

-గాంధీ కొండ ను పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒన్ టౌన్ గాంధీజీ పర్వతం పై నగరపాలక సంస్థ చేపట్టవలసిన అభివృద్ధి పనులు అన్నియు సత్వరమే చేపట్టాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలసి గాంధీ హిల్ ను పరిశీలిస్తూ, కాంపౌండ్ వాల్ నిర్మాణ మరియు పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు తదితర అంశాలతో పాటుగా కొండ పై భాగంలో జాయ్ ట్రైన్ కు తగిన మరమతులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా గ్రీనరి అభివృద్ధి లో భాగంగా కార్పెట్ గ్రాస్స్, లాన్ ఏర్పాటు మొదలగు అంశాలతో పాటుగా పాడైన లైట్ ల స్థానములో కొత్త లైట్ లు ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు. అదే విధంగా గాంధీ కొండ వద్ద రైల్ వే ట్రాక్ దిగువ నుండి ప్రవహిస్తున్న మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందు పేరుకుపోయిన చెత్త మరియు వ్యర్ధముల తొలగింపు పనులు పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. డ్రెయిన్ నందు తొలగించిన వ్యర్ధములు వెనువెంటనే అక్కడ నుండి తొలగించాలని అన్నారు. యంత్రముల ద్వారా చెత్త తొలగించుటకు గల అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *