నవరత్నాలు పేదలందరికి ఇళ్ళ పధకం .. డివిజన్ పరిధిలో 54,504 మంది లబ్ధిదారులు…

-లబ్ధిదారులు మధ్యవర్తుల బారిన పడవొద్దు, బిల్లుల చెల్లింపు కోసం ఒక్కరూపాయి ఇవ్వవొద్దు…
-వత్తిడి తెస్తే సోమవారం ఉదయం 10 నుంచి 1 వరకు ఫిర్యాదులు చెయ్యవొచ్చు…
-ఈ ఈ (హౌసింగ్) సిహెచ్. బాబురావు

కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పేదలందరికి ఇళ్ళు పధకం ” ఇళ్ళు నిర్మించుకునుచున్న లబ్ధిదారుల బిల్లులు మంజురూ కోసం ఏ అధికారికి గానీ, సిబ్బందికి గానీ, మధ్యవర్తులకు గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదని కొవ్వూరు డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ (గృహ) చల్ల బాబురావు తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన లో ఫిర్యాదులు స్వీకరించడం కోసం హౌసింగ్ శాఖ అధికారులతో ప్రత్యేక స్పందన కార్యక్రమం చేపడుతున్నట్లు బాబురావు తెలిపారు. పేదలందరికి ఇళ్ళు పథకం లో భాగంగా ఇళ్ళు నిర్మించుకునుచున్న లబ్ధిదారులకు బిల్లు బట్వాడా చేయుటకు, చెల్లింపు మంజురు కోసం ఏ అధికారికి గానీ, సిబ్బందికి గానీ, మధ్యవర్తులకు గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి సంఘటన లు ఏమైనా జరిగినా, లబ్ధిదారులపై వత్తిడి తీసుకుని వొస్తే అటువంటి వారి వివరాలు నేరుగా ఫిర్యాదు చేయవొచ్చని తెలియచేసారు. బిల్లులు చెల్లింపు లో డబ్బులు ఆశించి జాప్యము చేసిన అట్టివారి పై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివిజన్ పరిధిలో 54,504 మంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజురూ చెయ్యడం జరిగిందని బాబురావు పేర్కొన్నారు.

అధికారులు ఫోన్ వివరాలు :
ప్రతి సోమవారం కొవ్వూరు డివిజన్ / సబ్ డివిజన్ స్థాయికి సంబంధించిన శాఖ అధికారులు ఫోన్ లో అందుబాటులో ఉంటారని ఉదయం 10 నుంచి మ.1 గంట వరకు ఫిర్యాదు చేయవొచ్చని బాబురావు పేర్కొన్నారు. కార్యనిర్వాహక ఇంజినీర్ – 7093930584 ; సబ్ డివిజన్ స్థాయిలో ఉపకార్యనిర్వహక ఇంజినీర్లు : కొవ్వూరు – 7093930595 ; నిడదవోలు 7093930596 ; తణుకు – 7093930597 ; ఆచంట – 7093930627 వారిని సోమవారం నిర్దేశించిన సమయంలో ఫోన్ ద్వారా ఫిర్యాదు చెయ్యవొచ్చని స్పష్టం చేశారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *