నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు ఆర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం…

విజయవాడ/పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు ఆర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. బుధవారం పెనమలూరు మండలం వణుకూరులో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు అర్హులైన వారికి 90 రోజుల్లో ఇంటి స్థలం మంజూరు కొరకు అవసరమైన 43.50 ఎకరాల భూమిని రైతుల నుంచి స్వచ్ఛంద అంగీకారంతో సేకరించడం జరిగినందన్నారు. ఇందుకు సంబంధించి భూమిని పరిశీలించేందుకు రావడం జరిగిందన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ అన్ని వివరాలతో సమీక్షించారు. సబ్ కలెక్టర్ వెంట పెనమలూరు తహసీల్దార్ జి.భద్రు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *