Breaking News

ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి రావాలి… : కలెక్టర్ జె. నివాస్

-నిర్ధేశించిన లక్ష్యాలు సాధించడలో నిర్లక్ష్యన్ని సహించేది లేదు…
-లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి అందించడంలో వేగం పెరగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ మండలంలో ఇళ్ల నిర్మాణానికి అప్పగించిన భాద్యతలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం నందిగామ నియోజకవర్గ పరిధిలోని చంద్రల్లపాడు,కంచికచర్ల, నందిగామ, వీరుళ్లపాడు మండలంలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు నిర్మాణ ప్రతి తీరును ఆయా మండలాల హౌసింగ్, తహశీల్దార్, ఎంపిడివో తదితరు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ సామాగ్రికి ఎటువంటి కొరత లేదని,బేస్ మెంట్ లెవెల్ పూర్తి కాగానే రూ.60 వేలు మొదటి పేమెంట్ జరుగుతుందన్నారు. ఈ దృష్ట్యా లబ్ధిదారులను చైతన్య పరచి ఇళ్ల నిర్మాణలు పురోగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు.రోజు వారీ ప్రణాళికతో ముందుకు వెళ్ళలన్నారు. వారానికి కనీసం 500 ఇళ్లకు నిర్మాణ సామాగ్రి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారానికి 500 ఇళ్లకు బేస్మెంట్ స్థాయికి చేరుకునేల జగనన్న లే అవుట్లను ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రతీ గ్రామ/వార్డ్ వాలంటీర్ తన పరిధిలో వారానికి కనీసం 2 ఇళ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ స్థాయికి చేరేలా చూడాలని, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 5 ఇళ్లకు, గృహనిర్మాణ శాఖ ఏ .ఈ లు రోజుకు 25 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభయ్యేలా బేస్మెంట్ స్థాయికి చేరేలా చూడాలని, నిర్దేశించిన లక్ష్యాలను సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పధకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, వాటిని పూర్తి చేసేందుకు కల్పిస్తున్న సానుకూల వాతావరణాన్నిలబ్ధిదారులు అందిపుచ్చుకునేలా చైతన్య పరచాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ ) నుపుర్ శ్రీవాస్ అజయ్ కుమార్, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, గృహ నిర్మాణ శాఖ డీ.ఈ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *