Breaking News

రోగుల భద్రత దృష్ట్యా అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఫైర్ సెప్టీ పై మార్గదర్శకాలను అమలు చేయాలి…

-అగ్నిమాపక అధికారులు ఆస్పత్రులు పరీక్షలు అనంతం జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి…
-జాయింట్ కలెక్టరు (ఆభివృద్ది) ఎల్. శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల భద్రతకు ఆగ్నిమాపక అధికారుల పరీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా జారీ చేసిన ఫైర్ సేప్టీ నోఅబ్జక్షన్ ధృవ పత్రాన్ని తప్పని సరిగా పొంది ఉండాలని జాయింట్ కలెక్టరు (ఆభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. బుధవారం స్థానిక జాయింట్ కలెక్టరు శివ శంకర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రులు పైర్ సేఫ్టీ మార్గదర్శాకాలు అమలు పై తీసుకోవలసిన రక్షణ చర్యలపై ఆగ్ని మాపక అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల భద్రత దృష్ట్యా అవసరమైన పైర్ సేప్టీ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు అగ్ని మాపక అధికారులు ఆయా ఆస్పత్రులను తనిఖీలు చేస్తూ ఫైర్ సేప్టీ పై ఎన్ఓసీ ధృవ పత్రాలు లేని ఆస్పత్రుల పై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఆగ్నిమాపక శాఖ అధికారులు మార్గదర్శకాలకు అనుగుణంగా జారీ చేసిిన రక్షణ ఏర్పాట్లును విధిగా కల్పించాలన్నారు. అన్ని ఆస్పత్రులు ఆగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రులను పరీక్షించి జారీ చేసిన నో అబ్జక్షన్ ధృవ పత్రాలను తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసరు ఐ. ధర్మారావు, జిల్లా ఫైర్ ఆఫీసరు (విఎంసీ) శ్రీనివాస్, ఎస్ఎఫ్ఓ (విఎంసీ) ఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *