Breaking News

అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డైవ్ : ఆర్డివో

-వ్యవసాయ భూముల వ్యవసాయేతర భూములుగా మార్చుకొనుటకు నాలా చెల్లించి క్రమబద్ద కరించుకోడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో శాశ్వత నిర్మాణాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిఓ.ఎంఎస్.నెం.225 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 15-10-2019 తేదీ నాటికి శాశ్వత గృహాలు నిర్మించుకొని నివసిస్తున్న వారి ఇళ్లను క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆర్‌డివో తెలిపారు.
అట్టి వారు 75 చ.గ లోపు ఉంటే బేసిక్ వాల్యూలో 75 శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలని,
150 చ.గ లోపు ఉంటే బేసిక వాల్యూలో 75 శాతం ఫీజు చెల్లించాలి.
150 – 300 చ.గ లోపు ఉంటే బేసిక్ వాల్యూలో నూరుశాతం ఫీజు చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు.
జిఓ.ఎంఎస్ నెం.227 ప్రకారం వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాల కొరకు కన్వర్షన్ చేయించుకొనుటకు బేసిక్ వాల్యూలో 5 శాతం ఫీజు చెల్లించి ప్రొసీడింగ్స్ పొందవలసి ఉంటుందని, అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించే వారిని గుర్తించి పెనాల్డిలు వేయడం జరుగుతుందని, కావున ఎవరైనా ఫీజు చెల్లించకుండా వుంటే అట్టివారు ఫీజు (నాలా) చెల్లించి వ్యవసాయేతర భూములుగా మార్చుకొనుటకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ నెల 15 నుండి వచ్చేనెల 15 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఆర్ డివో తెలిపారు.
పై రెండు సౌకర్యములు పొందుటకు గ్రామ సచివాలయాలు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించబడునని ఆర్డీఓ తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆర్ డివో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పనిచేయని అగ్నిమాపక పరికరాలను మూడు రోజుల్లోగా పునరుద్ధరించాలి

-లేనిపక్షంలో అనుమతుల రద్దు : వీఎంసీ ఫైర్ అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *