దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిద్దాం…

-కరోనా నిబంధనలను అనుసరిస్తూ దర్శన ఏర్పాట్లు…
-ఆన్ లైన్ ద్వారానే దర్శన టిక్కెట్లు జారి…
-సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి…
-రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 1 నుంచి 15వ తేదీ వరకూ జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలను వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేద్దామని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ హాలులో గురువారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల శరన్నవరాత్రి ఉత్సవాలపై దేవాదాయశాఖ అధికారులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జిల్లా కలెక్టరు జె.నివాస్ దేవాదాయ శాఖ కమిషనరు జి. వాణీమోహన్ స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
తొలుత మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిపి కెనాల్ రోడ్ లోని వినాయక టెంపుల్ నుంచి బయలుదేరి రథం సెంటర్ ఘాట్ రోడ్ మీదుగా కొండ పైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శివాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కనకదుర్గానగర్‌ను కూడా పరిశీలించి మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసుకు చేరుకున్నారు. కౌన్సిల్ హాలులో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు భంగంవాటిల్లకుండా దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని కోరారు. కరోనా నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లను కల్పించాలన్నారు. దర్శనానికి ప్రతిరోజూ 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఇందులో 4 వేలమందికి ఉచిత దర్శనం, 3 వేలమందికి రూ. 100 దర్శనం, మరో 3 వేలమందికి రూ. 300 ల దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లను తీసుకోవాలని భక్తులను కోరారు. ఇప్పటి వరకూ కేవలం 600 మంది భక్తులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. కోవిడ్ నేపథ్యంలో భవానీ దీక్ష నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. అయితే రాష్ట్రంలోని కలెక్టర్లకు ప్రత్యేక లేఖ వ్రాయమని ఆశాఖ కమిషనరు వాణి మోహన్ ను కోరారు. సోషల్ మీడియా ద్వారా భక్తులకు పార్కింగ్, క్యూలైన్, ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మకం, తదితర విషయాలపై ప్రత్యేక వీడియోలు తీసి విస్తృత ప్రచారం కల్పించాలని ఆలయ ఇఓ భ్రమరాంబను కోరారు. భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించడానికి వీలులేదన్నారు. అయితే వారికోసం ప్రత్యేకంగా సీతమ్మపాదాలు వద్ద ప్రత్యేకంగా భక్తులు స్నానమాచరించేందుకు వాటర్ షవర్లను సిద్ధం చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టరు నివాస్ మాట్లాడుతూ భక్తులకు సేవలు అందించేందుకు మూడు షిఫులలో సిబ్బందిని నియమించాలని కోరారు. భక్తులకోసం ప్రత్యేకంగా మున్సిపల్ కార్పోరేషన్, దేవస్థానం 230 తాత్కాలిక బాత్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే 160 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉంటే అదనంగా 100 మందిని తీసుకుంటున్నారన్నారు. దుర్గగుడి క్రింద ప్రత్యేకంగా 650 మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఆసిబ్బందికి మూడు షిఫ్టులలో విధులు నిర్వర్తించేలా డ్యూటీలు వేయమని కలెక్టరు కోరారు. 50 వేల మాస్క్లను ప్రత్యేకంగా సమకూర్చుకోమని ఐవో భ్రమరాంబను ఆదేశించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి తప్పకుండా మాస్క్ ఉండాలని ఆదేశించారు. అలాగే శానిటైజర్ లను కూడా ఏర్పాటు చేయమని కోరారు. కొండ పైకి వాహనాలు అనుమతించమని స్పష్టం చేశారు. కొండ పైకి వచ్చే విదిపి భక్తులు కోసం ప్రత్యేకంగా 15 వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండ పైనా, దిగువునా అంబులెను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక వైద్యశిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సూచించారు. విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేలా విద్యుత్తు శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఏర్పాటు చేసిన జనరేటర్లను తాత్కాలిక విద్యుత్తు అలంకరణను పరిశీలించి సర్టిఫై చేయాలని విద్యుత్తు శాఖాధికారులను సూచించారు. ఘాట్ల వద్ద పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని అలాగే తెప్పోత్సవం రోజు తెప్పోత్సవానికి అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారి అలంకరణ, దర్శన ఏర్పాట్లు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం చేయాలన్నారు. ఉత్సవాలలో ప్రచారం కల్పించేందుకు మీడియా ప్రతినిధులకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసేలా సమాచార శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య పరిమితం చేయడం జరిగిందని మీడియా ప్రతినిధుల పాల సంఖ్యను పరిమితం చేసి పాన్లు అందజేయాలని కలెక్టరు జె.నివాస్ సూచించారు.

నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రత్యేకంగా సిబ్బందికి కోవిడ్ ర్యాపిడ్ టెస్టు చేయించమని విజ్ఞప్తి చేశారు. మూలానక్షత్రంరోజు తెల్లవారుఝామున 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు దర్శనం కల్పించాలన్నది విస్తృతంగా ప్రచారం చేయమని కోరారు. వర్షాలుపడితే కొండరాళ్లు జారి పడకుండా మరొకసారి అధికారులతో తనిఖీ చేయించమని కలెక్టరును కోరారు. అలాగే భారీవర్షం పడ్డప్పుడు భక్తుల రాకపోకలను కాసేపు నిలిపివేయమని కూడా కోరారు.

విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు విచ్చేస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
దేవాదాయ శాఖ కమిషనరు శ్రీమతి జి. వాణి మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలుగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. పరోక్ష సేవలు ద్వారా ఆలయ ఆదాయం 1.5 కోట్ల రూపాయలకు చేరిందని చెప్పారు. అలాగే పరోక్ష సేవకు రూ. 20 లు కట్టాలన్నారు. ఈ సేవల పై విస్తృతంగా ప్రచారం చేయమని ఆలయ అధికారులను ఆదేశించారు. భక్తుల మనోభావాలను పరిగణనలోనికి తీసుకుని ఎటువంటి ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

దేవస్థానం కార్యనిర్వాహణాధికారిణి  భ్రమరాంబ మాట్లాడుతూ భక్తులు మూడు లైన్లతో ప్రారంభ మై ఉం టర్నింగ్ వద్ద 5 లైన్లుగా క్యూలైన్లను విభజించామన్నారు. క్యూలైన్ కు వచ్చే భక్తులకు ధర్మో ప్కానర్ల ద్వారా టెంపరేచర్‌ను పరీక్షించడం జరుగుతుందన్నారు. క్యూలైన్లలో నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు చిన్నారులకు పాలను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ఆమె తెలిపారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో భాగంగా ఉత్సవాలలో లక్షకుంకుమార్చనకు మామూలు రోజులలో రూ.3 వేల రూపాయలు మూలానక్షత్రం రోజున రూ. 5 వేల రూపాయలు చండీహోమంకు రూ. 4 వేల రూపాయలు శ్రీచక్రవవార్చనకు రూ. 3 వేల రూపాయలు సేవా టిక్కెట్ల రేట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. సేవాటిక్కెట్లను https://aptemples.ap.gov.in నుండి ఆన్ లైన్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. నవరాత్రి 9 రోజులూ 10 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.
సమన్వయ సమావేశంలో ఆలయ ఛైర్మన్ పైలా స్వామినాయుడు. నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధి దేవినేని అవినాష్. విజయవాడ మున్సిపల్ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, జేసి (సం క్షేమం) మోహన్‌కుమార్, దేవాదాయ, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, అగ్నిమాపక, మత్స్యశాఖ, సమాచార శాఖ, రోడ్లు భవనాలు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో చర్చించిన మరికొన్ని అంశాలు :

చండీహోమం :- ఈహోమానికి రూ. 3 వేలరూపాయలు చెల్లించాలి. ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకూ ఈ హోమం జరుపుకోవచ్చు. చండీ హోమానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తాం. వారికి ప్రత్యేకంగా టెలిఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం కూడా అందజేస్తాం.

చీరలు సరిగ్గా భద్రపరచండి :- దుర్గా దేవికి భక్తులు బహుకరించే చీరలను వచ్చినవి భద్రపరచాలి. ప్రత్యేకంగా అవి నమోదు కూడా చేయాలి.

ఊరేగింపు :- ఊరేగింపులన్నీ ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేయాలి. పాదరక్షలు క్రింద 40 మంది గజ ఈతగాళ్లను, 20 బోట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. పున్నమి, భవాని ఘాట్లలో భక్తులు నదిలోకి దిగి స్నానం చేసే అవకాశం ఉన్నందువలన ఆమార్గాలన్నింటినీ మూసివేయండి..

మెడికల్ క్యాంప్స్ :- 9 మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. దేవాలయం వద్ద అంబులెన్స్ పెట్టండి. ఎవరైనా కోవిడ్ పాజిటివ్ గా గుర్తిసే తరలించేందుకు ఐపోలేషన్ పాయింట్ కూడా ఏర్పాటు చేయండి.

చిన్నపిల్లలకు పాలు :- క్యూలైన్లలో ఉన్న భక్తులు దాదాపు 5 గంటలపాటు వేచి ఉంటారని వారి చిన్నపిల్లలకు ప్రత్యేకంగా పాలు పంపిణీ చేయాలి. అలాగే ప్రతీ ఒక్కరికీ త్రాగునీటి ప్యాకెట్లను కూడా పంపిణీ చేయాలి.

వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలు :- వృద్ధులు, అంగ వైకల్యం గలవారికి ప్రత్యేక వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. వారి ద్వారా దర్శనం చేయించి వీరిని సురక్షితంగా పంపుతాం.

పాదరక్షలు :- కుమ్మరిపాలెం నుండి క్యూలద్వారా భక్తులు దుర్గమ్మగుడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అయితే పాదరక్షలు టిటిడి భవనంలో లేదా క్రొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి ప్రాంతంలో ఏర్పాటు చేసే కేంద్రంలోనే వదిలి వెళ్లాలి. దీనిపై దేవస్థానం విస్తృతంగా ప్రచారం చేయాలి.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *