Breaking News

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన డైరెక్ట‌ర్ యేదుపాటి వెంక‌ట ర‌మ‌ణి

-యేదుపాటి దంప‌తుల‌ను స‌న్మానించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఏపీ లేబ‌ర్ వెల్పేర్ బోర్డు డైరెక్ట‌ర్ గా నియ‌మితులైన యేదుపాటి వెంక‌ట ర‌మ‌ణి ఆదివారం మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో త‌న భ‌ర్త టిడిపి ఎన్టీఆర్ జిల్లా మీడియా కో- ఆర్డినేట‌ర్ యేదుపాటి రామ‌య్య తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన యేదుపాటి రామ‌య్య‌, వెంక‌ట‌ర‌మ‌ణిల‌ను శాలువాతో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌త్క‌రించి అబినంద‌న‌లు తెలిపారు.. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు యేర్నేని వేదవ్యాస్, న‌ర‌సింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌చ్చ‌వ మ‌ల్లికార్జున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *