Breaking News

వక్స్ బోర్డు భూముల మ్యాపింగ్ లో సౌత్ ఇండియాలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది…

-సంవత్సర కాలంలో అన్యాక్రాంతమైన 559.61 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
-కేంద్ర నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
-సెంట్రల్ వక్స్ కౌన్సిల్ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 559.61 ఎకరాల వక్ఫబోర్డు ఆస్థులను స్వాధీనం చేసుకుని ఆస్థులను పరిరక్షించారని సెంట్రల్ వక్స్ కౌన్సిల్ సభ్యులు జనాబ్ నౌషాద్, జనాబ్ హనీఫ్ ఆలీ. శ్రీమతి యస్. మున్వారీబేగం, శ్రీమతి దరక్షన్ ఆంద్రాబీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
విజయవాడలోని ఏపి స్టేట్ వక్స్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్రంలో వక్స్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గురువారం కౌన్సిల్ సభ్యులు సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వక్స్ బోర్డు ఆస్థులను 50 శాతంకు పైగా మ్యాపింగ్ చేసి సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ అమలుతోపాటు వక్స్ లీగల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను అమలు చేయుట ద్వారా వక్స్ బోర్డు ఆస్థులను పరిరక్షణకు చేపట్టిన చర్యలను కౌన్సిల్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అమలు చేస్తున్న పలు పధకాలు క్రింద రాష్ట్రంలో వక్స్ బోర్డు ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తామని అలాగే ఉమ్మడి తెలంగాణా రాష్ట్రంలోని వక్స్ బోర్డు నుండి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని కౌన్సిల్ సభ్యులు అన్నారు. రాష్ట్రంలో ఏపి వక్స్ బోర్డు కమిటీని, ఎక్స్ ట్రిబ్యునల్ త్వరగా ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. రాష్ట్రంలో వక్స్ బోర్డు లేకపోవడంతో కేంద్రం నుండి నిధులు రావడం ఆలశ్యం అవుతుందన్నారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని కౌన్సిల్ సభ్యులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షెహరీ సంపత్ వికాస్ యోజన్ వంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని కేంద్ర వక్స్ స్కీమ్ క్రింద కూడా నిధులు సమకూర్చేందుకు అవకాశాలను ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు సమీక్షించారు. ఏపి వక్స్ బోర్డు సిఇఓ యస్. అలీమ్ భాషా మాట్లాడుతూ 4 గురు సెంట్రల్ కౌన్సిల్ వక్స్ బోర్డు సభ్యులు 2 రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించి వక్స్ బోర్డు అస్థులను పరిశీలిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ఫ్ బోర్డు ఆస్థుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని కొన్సిల్ సభ్యులు అభిప్రాయ పడ్డారని అలీమ్ భాషా అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో 5 ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని సిఇఓ యస్. అలీమ్ భాషా అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రటరీ గంధం చంద్రుడు, సిఇఓ యస్. అలీంబాషా, ఏపి వక్స్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ షేక్ అహ్మద్, డిప్యూటి ఇంజినీర్ యల్.అబ్దుల్ ఖాదీర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయుల సమూవేశంలో వక్స్ బోర్డు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కౌన్సిల్ సభ్యులు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *