పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏజెన్సీ పరిధిలో వైద్య, విద్యా, ఉపాధి హామీ అవకాశాలు కల్పన కోసం ప్రణాళికలు అమలులో అధికారులు సమన్వయంతో పనిచెయ్యల్సి ఉందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యం, వైద్య సేవలు, విద్యా విధానం , ఉపాధిహామీ, తదితర అంశాలపై ఐటిడిఎ పరిధిలో కలెక్టర్ పిఓ ఐటిడిఎ ఓ.ఆనంద్, ఆర్డీఓ కె. ప్రసన్న లక్ష్మీ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారుల ప్రాధమిక బాధ్యత అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వెయ్యడమన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా, జ్వరాల తీవ్రతపై క్యాలెండర్ రూపొందించుకుని , గ్రామ సచివాలయ ల వారీగా సమీక్ష చేయాలన్నారు. అందుకనుగుణంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా సీజెరియన్ కేసులు నమోదు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. గర్భిణీలకు, బాలింతలకు, పుట్టిన బిడ్డ ల ఆరోగ్య పరిస్థితి ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు. మెడికల్ శాఖ వారు ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారని, ఐసీడీఎస్ వారు పౌష్టికాహారం అందించి, పెరుగుదల అంశాలను పర్యవేక్షణ చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మరింత సమన్వయం తో పనిచెయ్యడం ముఖ్య మన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా వెయ్యలని, సంబంధించిన వివరాలు సేకరించాలని తెలిపారు. ఏ ఒక్కరు వ్యాక్సినేషన్ కాకుండా ఉండకూడదు అని స్పష్టం చేశారు. ఏఎన్ఎం, ఆషా వర్కర్లు సేకరించే ప్రతి కేసును పిహెచ్ సి డాక్టర్లు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఐ ఎమ్ ఆర్, ఎమ్ ఎమ్ ఆర్ కేసుల నమోదు తగ్గుదల/ కేసులు లేకుండా చూడాలని, ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం ఇస్తున్నా ఇంకా మెరుగైన ఫలితాలు రాకపోవడానికి కారణాలు అధ్యయనం చేయాలన్నారు. సురక్షితమైన డెలివరీ, ఆరోగ్య వంతంగా బిడ్డ పెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. బిడ్డ ఎదుగుదల, హీమోగ్లోబిన్, బరువు వంటి వాటిపై వివరాలు ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయండి అని తెలిపారు. మనం అందించే పౌష్టికాహారం సరిపోతుందా, సక్రమంగా వినియోగించుకొనుచున్నారా అనే వాటిపై దృష్టి సారించాలన్నారు. డెలివరి అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి వాహనం ద్వారా పంపించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి అధికారి వారి పరిధిలో ఇద్దరు గర్భిణీ స్త్రీల, ఇద్దరు పిల్లల సంరక్షణ భాద్యత చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల ప్రయోజనం కలుగుతుందా లేదా తెలుసుకుని, వారి ఆరోగ్య పరిస్థితి కోసం భాద్యత స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో కావాల్సిన వైద్య సౌకర్యాల కల్పన కల్పించ గలుతామన్నారు. విద్యా బోధన, బడిబయట పిల్లలు విషయంపై సచివాలయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సంరక్షణ నుంచి బయటకు వొచ్చిన బడీఈడు పిల్లల్లో ఎంత మంది పాఠశాలలకు వెళుతున్నారో గణాంకాలు రూపొందించి పర్యవేక్షణ చేయాలన్నారు. బడిబయట పిల్లలు స్కూల్స్ కి వొచ్చేలా మండల స్థాయిలో ఎమ్ ఈ ఓ లు సమావేశాలు నిర్వహించి చైతన్యం తేవాలన్నారు. 3 కస్తూరి బా పాఠశాలలు, 3 వసతి గృహాలు, ఏకలవ్య పాఠశాలల పై మరింతగా దృష్టి సారించాలన్నారు. పిల్లలకు అందిస్తున్న ఆహారం, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయులు , పిల్లల భద్రత, పాఠశాల ప్రాంగణం పారిశుద్ధ్య అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కార్తికేయ మిశ్రా ఆదేశించారు. పాఠశాల లో కోవిడ్ నేపథ్యంలో తీసుకున్న చర్యలను తల్లి దండ్రులు కు తెలిపేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, జగనన్న కిట్స్ పంపిణీ పై సమీక్షించి, కొత్తగా చేరిన విద్యార్థులు కోసం ప్రతిపాదనలు తెలియచేయండని అధికారులను ఆదేశించారు. మన పిల్లలు పాఠశాలలో చదివితే ఏ విధమైన భోదన, మౌలిక సదుపాయాలు కోరుకుంటామో, వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి సమకూర్చాలే చర్య లు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సంకల్పం చేస్తే ఒక్కసారిగా సాధ్యం కాదని, ప్రతి ఉద్యోగి తనకు నిర్దేశించిన లక్షల్లో కనీసం 50 శాతం మించి చెయ్యగలుగితే ఉత్తమ ఫలితాలు వెలువడతాయ ని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ఏజెన్సీ ప్రాంతంలో వేజ్ / లెబర్ కాంపోనెంట్ కింద పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం సాధ్యమని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కేవలం 11 శాతం లక్ష్యాన్ని సాధించడం మీ పనితీరుకి నిదర్శనం అని తెలిపారు. వేజ్ కంపోనెంట్ ద్వారా పనులు చేపట్టి మేటిరియల్ కంపోనెంట్ ను సమకూర్చుకోగలమని తెలిపారు. రాబోయే 7 / 8 రోజుల్లో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.సి.మురళీకృష్ణ, డిఎమ్ఓ డా.పి ఎస్సెస్ ప్రసాద్, డిడి (టి డబ్యూ) పి. వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ , ఆర్ అండ్ బి , ఐ టి డి ఏ, పీ హెచ్ సి డాక్టర్లు, ఎమ్ ఈ ఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News