రామ్ రాజ్ కాటన్ ఆధ్వర్యంలో ధోతి శతాబ్దివేడుక…

-ప్రారంభించిన రామ్ రాజ్ కాటన్ ఎండీ కె.ఆర్. నాగరాజన్ *’గాంధియా వాజియిల్రామ్రాజ్’ పై సాంప్రదాయ నృత్య నాటక ప్రదర్శన * మహాత్మవైకొండదువొమ్” అనే పుస్తకావిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామ్ రాజ్ కాటన్ ఆధ్వర్యంలో ధోతిశతాబ్ధి వేడుకలను నిర్వహిస్తున్నారు. ధోతి 100 పేరుతో తిరుపూర్లో ఈవేడుకను నిర్వహిస్తున్నారు. ధోతిని తన వస్త్రాధరణగా మార్చుకున్నమహాత్మగాంధీ శత వార్షికోత్సవాన్నిపురస్కరించుకొని ఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 100 మంది అమరవీరులు, 100 మందినేత కార్మికులను సత్కరించనున్నారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలో భాగంగా 100 మొక్కలు నాటనున్నారు. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ కు చెందిన నృత్యకారులు ‘గాంధియా వాజియిల్రామ్రాజ్’ పై సాంప్రదాయ నృత్యనాటకాన్ని ప్రదర్శించారు. ఈకార్యక్రమాన్ని రామ్ రాజ్ కాటన్ ఎండీ కె.ఆర్. నాగరాజన్ ప్రారంభించి మాట్లాడుతూ “మహాత్ముని వస్త్రధారణ ‘జాతీయవస్త్రధారణ మరియు గుర్తింపు’ చిహ్నంగా మారిందన్నారు. 40వేలమంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత 40 ఏళ్లుగా వారి చేనేత చక్రానికి 40 ఏళ్లుగా అండగా నిలుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా “మహాత్మవైకొండదువొమ్” అనే పుస్తకాన్నిముఖ్యఅతిథి కోయంబత్తూర్ భారతీయ విద్యాభవన్ ఛైర్మన్ డాక్టర్ బి.కె. కృష్ణరాజ్ వనవరాయర్ ఆవిష్కరించడంతోపాటు పుస్తకం మొదటి కాపీని కోయంబత్తూరు రూట్స్ గ్రూప్ అఫ్ ఛైర్మన్ కె. రామస్వామి అందించారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *