ఎల్ అండ్ టి డ్రెయిన్ నిర్మాణాలలో గల గ్యాప్ లను సత్వరమే పూర్తి చేయాలి… :  కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ శుక్రవారం సర్కిల్-3 పరిధిలోని పలు ప్రాంతాలలో ఎల్ అండ్ టి వారి ద్వారా చేపట్టిన డ్రెయిన్ నిర్మాణ పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసారు. హరిజన వాడ నందలి పుల్లేటి డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ, డ్రెయిన్ నందు గ్యాప్ ఫిల్లింగ్ పనులు అన్నియు సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. పిన్నమనేని పొల్లిక్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, గాయిత్రి నగర్, డి.వి.మ్యానర్ రోడ్ నందలి డ్రెయిన్ లను పరిశీలిస్తూ, నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాల విషయమై విద్యుత్ అధికారులతో చర్చించి నిర్మాణానికి అడ్డంగా గల పోల్స్ తరలించి నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. తదుపరి బెంజి సర్కిల్ ట్రెండ్ సెట్ సర్వీస్ రోడ్ లో ప్యాచ్ వర్క్ పనులు తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. పై ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచుటతో పాటుగా మురుగునీటి పారుదలకు అడ్డంగా గల చెత్త మరియు వ్యర్ధములను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని అన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.చంద్ర శేఖర్ మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *