Breaking News

‘సిటిజన్‌ అవుట్‌ రీచ్‌’ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు…

-సచివాలయాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకముపై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనను సుగుమం, సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్ గారి సూచనలకు అనుగుణంగా నగర పరిధిలోని 286 వార్డ్ సచివాలయ సిబ్బంది వార్డ్ వాలెంటరీ లతో కలసి క్షేత్ర స్థాయిలో వారికీ కేటాయించిన డివిజన్ లలో పర్యటించి సంక్షేమ క్యాలెండర్ ను లబ్ధిదారులకు వివరించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో, మొబైల్ యాప్ నందు వ్యాక్సిన్ వేసుకోనిన వివరాలు పొందుపరచుట జరిగింది. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేయుటకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమము ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌లో ప్రభుత్వ సేవలు, పథకాలను ప్రజలకు వివరించుట జరిగింది. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను ప్రకారం ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్రజలకు క్లుప్తంగా తెలియజేస్తున్నారు. వ్యాక్సినేషన్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *