చోరీ కేసు బాధితులను పరామర్శించిన మల్లాది విష్ణు…

-నిందితులను త్వరితగతిన పట్టుకోవలసిందిగా పోలీస్ సిబ్బందిని కోరిన ఎమ్మెల్యే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురంలో గురువారం చోరీ జరిగిన ఇంటిని శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. నగరంలో నేరస్తులకి స్థానం లేదని.. నేరం చేయాలని ఆలోచన వచ్చినా కటకటాలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే వారికి నగర బహిష్కరణ తప్పదని మల్లాది విష్ణు అన్నారు. కేసుకు సంబంధించి నేరస్తులను త్వరితగతిన పట్టుకోవలసిందిగా పోలీస్ శాఖను కోరారు. మరోవైపు కాలానుగుణంగా సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు  అన్నారు. మరీముఖ్యంగా నగరంలోని ప్రముఖలు, వ్యాపారస్తులు తమ తమ కార్యాలయాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాతలు సైతం ముందుకొచ్చి ప్రతి డివిజన్ లోనూ ప్రధాన కూడళ్ళ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటునందించి పోలీస్ శాఖకు సహకరించవలసినదిగా కోరారు. అటువంటి దాతలను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా సత్కరిస్తామని తెలియజేసారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు కనగర్ల ఫణి, కొల్లూరు రామకృష్ణ, చల్లా సుధాకర్, కూనపులి ఫణి, ఓగిరాల రాజశేఖర్, కొప్పరపు మారుతి, సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *