Breaking News

మధ్యాహ్న భోజన పధకం మెనూ ఖచ్చితంగా పాటించాలి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం

-ముసునూరు జెడ్పి హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ

ముసునూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం మెనూని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజినల్ అధికారి శ్రీమతి కె. రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ని శనివారం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్న భోజన పధకం, విద్య బోధన, పాఠశాల రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కు శ్రీకారం చుట్టిందన్నారు. విద్య ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, తదితర కార్యక్రమాల ద్వారా ప్రతీ పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తున్నదన్నారు. “మన బడి- నాడు-నేడు ” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మూడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ స్థాయిని మించి తీర్చిదిద్దుతున్నదన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని మూడోవ వంతు పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, ప్రస్తుతం ” నాడు-నేడు ” కార్యక్రమం కింద రెండవ సంవత్సరంలో రెండవ దశలో పనులు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించేవారికి పౌష్టికాహార లోపం లేకుండా సవరించిన మెనూ ప్రకారం మెరుగైన పోష్టికాహారం అందిస్తున్నదన్నారు. పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పధకం నిర్దేశించిన మెనూ ప్రకారం జరిగేలా ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలన్నారు. విద్యార్థులలో ప్రతిభ వెలికితీసే విధంగా గుణాత్మక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక బోధన చేయాలన్నారు. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాల, యూనిఫారంలు, బూట్లు, స్కూల్ బాగ్, తదితరాలు అందరికీ అందించాలన్నారు. తాను తరచుగా ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తణిఖీ చేస్తానని, పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి, మధ్యాహ్న భోజన పథకం, నాడు-నేడు పనులను పరిశీలిస్తానని, ఎక్కడైనా లోపం కనపడితే వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ వాడకం, శానిటైజేర్ వినియోగం, సామజిక దూరం పాటించడం పై విద్యార్థినీ విద్యార్థులలో అవగాహన కలిగించాలని ఆర్డీఓ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లను ఆర్డీఓ పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం

-మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల -ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *