Breaking News

జిజిహెచ్ లోని ఓఏ విభాగాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్…

-ఓఓలో రోగుల రిజిస్ట్రేషన్ విధానం వరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ సందర్శించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వచ్చిన సమయంలో ఓపి కౌంటర్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో రోగులకు టోకెన్లు ఇవ్వడం జాష్యం అవుతున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ వెంటనే మరిన్ని కౌంటర్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిజిహెచ్ లో ఓపి విభాగంలో ఆదనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లను, రోగుల రిజిస్ట్రేషన్ విధానాన్ని సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ క్షుణ్ణంగా పరిశీలించారు.
ఓపి విభాగంలో ఆదనంగా ఏర్పాటు చేసిన సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపిలో టోకెన్లు జారీలో ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని సూచించారు. కొంత సేపు ఓపి కౌంటర్ వద్ద సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ వేచి వుండి రోగులకు టోకెన్ల జారీని పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం… అభ్యున్నతి గురించే

-జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది -రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *