వినికిడి పరికరాలు ఉచితంగా పంపిణి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ 106 వ జయంతి వేడుకలు సిద్ధార్ధ అకాడమి ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో పేదలకు వినికిడి పరికరాలు ఉచితంగా అందచేయడం గొప్ప విషయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారత సమాజాన్ని ఆద్యంతం పరిశీలించి దీనిని సంస్కరించాలని భావించారన్నారు. అందుకోసం ఏకాత్మతా మానవతావాదం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని, దానినే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతంగా తీసుకుందని వివరించారు. ఆయన స్ఫూర్తితో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ సేవ చేయడం ముదావహమని అన్నారు. కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ, గొప్ప వ్యక్తిత్వం, సేవా దృక్పధం కలిగిన దీన్ దయాళ్ మానవాళికి ఆదర్శమన్నారు. ఆయన అందించిన సిద్ధాంతంతోనే భాజపా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ రేగుల రామాంజనేయులు సభాధ్యక్షులుగా వ్యవహించారు. 2018 సెప్టెంబరు 21న దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ ప్రారంభించి అవసరమైన వారికి వినికిడి పరికరాలు ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. వేదికను భాజపా సీనియర్ నాయకలు ఉ ప్పలపాటి శ్రీనివాసరాజు, అడ్డూరి శ్రీరామ్, డా||ఎస్.కె.హసీనా, వరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *