అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంట్లో ఉంటే/ If indoors
• ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయండి.
• తలుపులు మరియు కిటికీలు మూసివేసి ఉంచండి.
• మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి.
• రేడియో న్యూస్ వినండి,అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి.
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
• భవనం కూలిపోవటం జరుగుతుంటే,దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
బయట ఉంటే / If outdoors
• దెబ్బతిన్న/పాత భవనాల్లోకి ప్రవేశించవద్దు.
• వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకిండి.
• చెట్టు / విద్యుత్ స్తంభం కింద ఎప్పుడూ నిలబడకండి.
• వాతావరణం ప్రశాంతం గా ఉంటే జాగ్రత్త గా నిశితంగా వేచి చుడండి, తుఫాను ముగిసిందని అనుకోకండి, ఒక్కసారిగాపెద్ద/హింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవవచ్చు, అధికారిక ఉత్తర్వులు ‘ఆల్ క్లియర్’ అని వచ్చెంతవరకు సహనంతో ఉండండి.
తుఫాను తరువాత/ After cyclone
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
• అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు.
• విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు మరియు ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.
• దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.
• దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయంచండి.
మత్స్యకారులు చేయవలసినవి/ Fishermen Should
• పుకార్లను నమ్మకండి, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
• మొబైల్ ఫోన్లను అత్యవసర సమయం లో వాడుటకు/కమ్యూనికేషన్ కు ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచండి, SMS లను చూస్తూ ఉండండి.
• ముఖ్యమైన ఫోన్ నంబర్స్ ను కాగితంపై వ్రాసి సురక్షితంగా ఉంచండి.
• అదనపు బ్యాటరీలతో రేడియో ను మీతో ఉంచుకోండి.
• వాతావరణ సమాచారం/హెచ్చరికల కోసం,రేడియో న్యూస్ వినండి, టీవీ చూడండి, వార్తాపత్రికలు చదవండి.
• పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతం లో కట్టి ఉంచండి.
• సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు.
చూస్తూ ఉండండి.