విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికి ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలని సంబంధింత అధికారులను, సిబ్బందిని విజయవాడ సబ్ స్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశించారు. స్థానిక నార్త్,సెంట్రల్ తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి విఆర్ఓ లు, రెవెన్యూ సిబ్బంది తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ మ్యాపింగ్ కు సంబంధించి ఇంత వరకు 92 శాతం పూర్తి చేసారని మిగిలినది కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితికి మించి ఇళ్ల మంజూరు దరఖాస్తులు ఉంచకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శాఖాపరమైన పలు అంశాలపై సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ సమీక్షించారు. సమావేశంలో అర్బన్ తహసీల్దార్ వెన్నెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
