కొవ్వూరు డివిజన్ పరిధిలో రెండు స్పందన ఫిర్యాదులు…

-డివిజన్ పరిధిలో తుఫాను కారణంగా ముంపునకు గురైయ్యే ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది…
-ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో, కలెక్టర్ సూచనలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో పి. పద్మావతి తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా పి. పద్మావతి మాట్లాడుతూ, ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు అందాయన్నారు.
సమిస్రెగూడెం లో కమ్యూనిటీ హాల్ కోసం మహమ్మద్ జావిడ్ హుస్సేన్, పింఛను కోసం కొవ్వూరు కి చెందిన జీ. వీరాస్వామి లు దరఖాస్తు లు సమర్పించారన్నారు.

కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్:
తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారని ఆమె తెలిపారు. ముంపుకు గురైయ్యే ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను నివేదికను అందించాలని ఆదేశించారని ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలో ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి పై సమీక్షించి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామం, నిడదవోలు మండలం కంసాలిపాలెం ఎర్రకాలువ గట్టును పరిశీలించడం జరిగిందని పద్మావతి తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో తహసీల్దార్ లు, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది తో కలిసి పరిశీలించారు. స్పందన, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, కొవ్వూరు తహశీల్దార్ నాగరాజు నాయక్, కొవ్వూరు డివిజనల్ , కొవ్వూరు మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *